Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ లో నివురుగప్పిన నిప్పు.. చెలరేగుతుందా?
By: Tupaki Desk | 12 Feb 2020 1:30 AM GMTటీఆర్ఎస్ పార్టీ లో గత కొంతకాలంగా సీనియర్లంతా సైలెన్స్ అయిపోయారు. పార్టీలో ఒకప్పుడు హవా కొనసాగించిన నేతలంతా ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్నారు. రానున్న రోజుల్లో తమ పదవికి ఎసరు రాకుండా సీనియర్లంతా మూకుమ్మడి సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఒక్క కేటీఆర్ హవా మాత్రమే కొనసాగుతోంది. కేటీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ వ్యవహరాలను చూస్తూనే మరోవైపు ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. టీఆర్ఎస్ లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నియామకం నుంచి ఐఏఎస్ ల బదిలీల్లోనూ కేటీఆర్ మార్క్ కనిపిస్తుందని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. దీంతో నేతలంతా కేటీఆర్ వర్గంగా ముద్ర వేయించుకునేందుకు తహతహ లాడుతున్నారు.
* గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న సీనియర్లు..
టీఆర్ఎస్ పార్టీలోని చాలామంది సీనియర్ల ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ తొలి స్పీకర్ గా పని చేసిన మధుసూదనాచారి రాజకీయ భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కిందటి ఎన్నికల్లో మధుసూదనాచారి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యాడు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చి శానస మండలి స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అలాగే మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి పరిస్థితి ఇలానే ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి హోంమంత్రి గా నాయిని నర్సింహా రెడ్డి పని చేశారు. త్వరలోనే నాయిని పదవీ కాలం పూర్తవుతోంది. దీంతో మరోసారి నాయిని పదవిని రెన్యూవల్ చేయరనే ప్రచారం టీఆర్ఎస్ లో జరుగుతోంది. ఇదే జరిగితే నాయినికి గడ్డుపరిస్థితి ఏర్పడినట్లే. అలాగే తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, స్వామిగౌడ్ లకు టీఆర్ఎస్ లో మునుపటి ప్రాధాన్యత లభించడం లేదన్న చర్చ సాగుతోంది. అలాగే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో పదవి దక్కుతుందని పార్టీలో చేరారు. అయితే ఆయనకు ఇంతవరకు ఎలాంటి పదవి దక్కలేదు. మరోవైపు కేటీఆర్ తన మార్క్ చూపుతుండటంతో రానున్న రోజుల్లో వీరికి పదవులు దక్కుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
* స్పష్టంగా కన్పిస్తున్న కేటీఆర్ మార్క్..
టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ మార్క్ స్పష్టంగా కన్పిస్తోంది. ఎమ్మెల్సీల్లో శంబీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ లకు పదవులు రావడంలో కేటీఆర్ మార్క్ కనిపించింది. కేటీఆర్ యువతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వీరికి పదవులు దక్కుతున్నాయని పలువురు నేతలు చెబుతున్నారు. అలాగే ఇటీవల జరిగిన ఐఏఎస్ బదిలీల్లోనూ కేటీఆర్ మార్క్ ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ వైపు కేటీఆర్ తన మార్క్ కోసం ప్రయత్నిస్తుండటంతో సీనియర్లు తమ పదవులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లంతా కేసీఆర్ ను కలిసేందుకు సిద్ధమతున్నారట. ఈసారి పదవి దక్కకపోతే తామకింక పదవి రాదనే ఆలోచనలో సీనియర్లు ఉన్నారు. అయితే కేసీఆర్ అపాయింట్మెంట్ వీరికి దొరకడం లేదనే టాక్ విన్పిస్తోంది. అలాగే తమ గోడును కేటీఆర్ కు వెళ్లగక్కలేక సీనియర్లంతా లోలోపల మథన పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్లు మాత్రం తమకు ఇచ్చిన మాటను నిలుపుకోకపోతే సీరియస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి సైలెంట్ గా కన్పిస్తున్న నేతలు పదవులు దక్కకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ పరిణామం టీఆర్ఎస్ లో నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు.