Begin typing your search above and press return to search.
ఈ సారి 'ఇమేజ్ గోల్'.... కేసీఆర్ 'పేద్ద' వ్యూహం!
By: Tupaki Desk | 1 July 2023 8:00 AM GMTచిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అనేది సామెత. అయితే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. సెంటిమెం టు వాసన గుబాళించేలా చేయాలనేది తెలంగాణ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహం. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఆయన 2014, 2019లో స్థానిక అజెండాతో ఎన్నికలను ఎదుర్కొన్నారు. తెలంగాణ తెచ్చామనే నినాదంతో 2014లోనూ.. ఏపీవోళ్లకు.. మనం దాసోహం చేద్దామా.. అనే కామెంట్‌తో 2019లోనూ కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లారు..
మొత్తానికి రెండుఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు. ఆమాటకు వస్తే.. 2014 కంటే కూడా.. 2019లో మరిన్ని ఎక్కువ స్థానాల్లోనే విజయం సాధించారు. ఇక, ఇప్పుడు మరో నాలుగు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం అవసరం.. అత్యవసరం.. అనే దృష్టితో కేసీఆర్ చూస్తున్నారు. పైగా కొత్తగాఏర్పడిన రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రి కావడం.. తన పార్టీ అధికారంలోకి రావడం.. ఇప్పుడు ఆయన అత్యంత ప్రతిష్టాత్మకం.
మరి ఇప్పుడు టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్‌గా మార్చిన దరిమిలా.. తానే స్వయంగా పొరుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టిన నేపథ్యంలో 'స్థానిక' సెంటిమెంటుకు అడ్డుగోడ కట్టుకున్నట్టు అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన ''పేద్ద నాయకుడు'' అనే మరో కార్డును బయటకు తీశారు. తన 'బలాన్ని, బలగాన్ని' నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. తద్వారా.. ''తెలంగాణ సమాజంలో కేసీఆర్‌ను మించిన నాయకుడు ఈ దేశంలోనే లేడు'' అనే టాక్ ప్రచారం చేయాలనేది ఆయన వ్యూహంగా చెబుతున్నారు.
సహజంగానే ఎవరైనా.. 'పెద్ద'దిక్కునే కోరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు-కేసీఆర్‌తో ముడిపడిన బంధంలో సెంటిమెంటు స్థానంలో పెద్దదిక్కు, పెద్ద నేత.. మన సారు.. అనే మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని.. ఇతర పార్టీల నేతలను.. పిల్లకాకులు.. సన్నాసులు.. అనే ప్రచారం చేయడం ద్వారా.. కేసీఆర్ పేద్ద నాయకుడిగా చలామణి అయితే.. ప్రజలు తనవైపు మొగ్గుతారనే సూత్రాన్ని ఆయన పాటిస్తున్నట్టు చెబుతున్నారు.
ఎలా చూసుకున్నా.. మహారాష్ట్రకు వందల కార్లలో వెళ్లినా.. ఇతరనేతలను పార్టీలో చేర్చుకుంటున్నా.. వెనుక ఉన్న వ్యూహం మాత్రం.. ఖచ్చితంగా ప్రజల మనసుల్లో 'పేద్ద నాయకుడిగా'' గుర్తింపు తెచ్చుకుని.. రాష్ట్రంలో మరోసారి విజయం దక్కించుకోవడమే ధ్యేయంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.