Begin typing your search above and press return to search.

కేసీయార్ దృష్టి ఎందుకు మారింది ?

By:  Tupaki Desk   |   26 Jun 2023 9:00 PM GMT
కేసీయార్ దృష్టి ఎందుకు మారింది ?
X
ఇపుడీ విషయమే పార్టీలోని నేతల్లో చాలామందికి అర్ధంకావటం లేదు. మరో ఆరు మాసాల్లో తెలంగాణాలో షెడ్యూల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో పూర్తి సమయాన్ని తెలంగాణాకే కేటాయించిల్సిన కేసీయార్ విచిత్రంగా మహారాష్ట్ర పర్యటనల్లో బిజీగా ఉంటున్నారు.

నెలలలో కనీసం ఐదారు రోజులు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో షోలాపూర్లో పర్యటించబోతున్నారు. మొన్ననే నాందెడ్ లో పర్యటించొచ్చారు. ఈమధ్యనే పండరిపురం వెళ్ళొచ్చారు. మొత్తానికి కేసీయార్ ఆలోచనలు ఏమిటో కానీ ఎక్కువగా మహారాష్ట్ర మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు.

నిజానికి వచ్చేఎన్నికల్లో తెలంగాణాలో బీఆర్ఎస్ గెలవటం కష్టమనే ప్రచారం అందరు చూస్తున్నదే. పార్టీపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. మంత్రులు, ఎంఎల్ఏల అవినీతి, అరాచకాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ముగ్గురు ఎంఎల్ఏల మీద లైంగిక ఆరోపణలున్నాయి.

ఇక భూముల ఆక్రమణ, పంచాయితీలు, పథకాల్లో అవినీతికి పాల్పడుతున్న మంత్రులు, ఎంఎల్ఏల విషయమైతే చెప్పక్కర్లేదు. ఒక సమీక్షలో కేసీయార్ మాట్లాడుతు సుమారు 45 మంది వివిధ పథకాల అమలులో అవినీతికా పాల్పడుతున్నట్లు చెప్పారు.

45 మంది ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడుతున్నట్లు స్వయంగా కేసీయారే చెప్పారంటే ఈ సంఖ్య ఇంకా ఎంతుందో తెలిసిపోతోంది. రేపటి ఎన్నికల్లో తెలంగాణాలో గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు. లేకపోతే మహారాష్ట్రలో పోటీచేసినా ఢిల్లీలో పోటీచేసినా ఎలాంటి ఉపయోగముండదన్న విషయం కేసీయార్ కు తెలీందికాదు. అలాంటిది తెలంగాణాను వదిలిపెట్టి మహారాష్ట్ర మీద దృష్టిపెట్టడం అంటే నేలవిడిచి సాముచేయటమనే చెప్పాలి.

కేసీయార్ ఆలోచనలు ఎవరికీ ఒక పట్టాన అర్ధంకావు. ఏ పని ఎందుకు చేస్తారు ? ఏ నేతతో ఎప్పుడు సఖ్యతగా ఉంటారో కూడా ఎవరికీ తెలీదు. ఇలాంటి స్ధిరచిత్తంలేని రాజకీయం వల్లే జాతీయస్ధాయిలో కేసీయార్ అందరిముందు పలుచనైపోయారు. ఈమధ్యనే పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో కేసీయార్ ను పిలవలేదన్న విషయం గుర్తుండే ఉంటుంది. క్రెడిబులిటి లేని కారణంగానే ప్రతిపక్షాలు కేసీయార్ ను దూరం పెట్టేస్తున్నాయి.

ఇవన్నీ చూసుకోకుండా కేసీయార్ ఇపుడు మహారాష్ట్రమీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మరి కేసీయార్ వ్యూహం ఏమిటో చాలామందికి అర్ధంకావటంలేదు. చివరకు బీఆర్ఎస్ ను మహారాష్ట్ర ఏమిచేస్తుందో చూడాల్సిందే.