Begin typing your search above and press return to search.

ఆస్ప‌త్రిలో రామోజీ..పరామ‌ర్శించిన కేసీఆర్‌, జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   28 Jan 2017 7:22 PM GMT
ఆస్ప‌త్రిలో రామోజీ..పరామ‌ర్శించిన కేసీఆర్‌, జ‌గ‌న్‌!
X
తెలంగాణా ముఖ్య మంత్రి కె చంద్రశేఖర్ రావు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ప‌రామ‌ర్శించారు. స్వల్ప అనారోగ్యానికి గురై య‌శోదా ఆస్ప‌త్రిలో చికిత్సి పొందుతున్న రామోజీనీ కేసీఆర్ క‌లిశారు. కొద్దికాలం క్రితం అనారోగ్యానికి గురై య‌శోద ఆస్ప‌త్రిలో రామోజీ రావు చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించుకొని మ‌రీ వెళ్లి రామోజీరావును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రామోజీ రావుకు అందుతున్న వైద్యం గురించి కేసీఆర్ వాక‌బు చేశారని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం. మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌కు, ఆస్ప‌త్రి వ‌ర్గాల‌కు రామోజీ రావు సూచించిన‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని రామోజీ రావుకు కేసీఆర్ చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇదే విధంగా రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి కూడా రామోజీ ని పరామ‌ర్శించి వెళ్లారని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. త‌న వెంట పార్టీకి చెందిన నేత‌ల‌ను వెంట‌బెట్టుకోకుండా త‌మ కుటుంబానికి స‌న్నిహితంగా ఉండే ఓ నాయ‌కుడితో క‌లిసి య‌శోద ఆస్ప‌త్రికి వెళ్లిన జ‌గ‌న్ రామోజీ రావు ఆరోగ్య ప‌రిస్థితి గురించి వాక‌బు చేసిన‌ట్లు స‌మాచారం. వైద్యం అందుతున్న తీరు అడిగి తెలుసుకున్న జ‌గ‌న్‌..తొంద‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించిన‌ట్లు తెలుస్తోంది.