Begin typing your search above and press return to search.

'రౌడీ' కి సవాలు విసిరిన తెలంగాణ ముఖ్య ఐఏఎస్ అధికారి

By:  Tupaki Desk   |   12 Nov 2019 6:44 AM GMT
రౌడీ కి సవాలు విసిరిన తెలంగాణ ముఖ్య ఐఏఎస్ అధికారి
X
టైటిల్ చూసి ఇదేదో సీరియస్ మ్యాటర్ అని మాత్రం అనుకోకుండి. కాకుంటే.. గతానికి భిన్నంగా తాజా పరిణామాన్ని చెప్పాలి. సాధారణంగా ప్రభుత్వం లో కీలక స్థానాల్లో ఉండేవారు.. సీనియర్ అధికారులు తమ పరిధు ల్లో నుంచి బయటకు వచ్చేందుకు పెద్దగా ఇష్టపడే వారు కాదు. ఒకవేళ వచ్చినా మీడియా లో వార్తల రూపంలో నిలిచేందుకు ససేమిరా అనేవారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితులు మారి పోయాయి. కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గ్లామర్ కోసం పాకులాడుతున్నారా? అన్న మాట వచ్చే లా వారి తీరు ఉందంటున్నారు. తన మాటల తో.. చేతలతో యూత్ ను విపరీతం గా అట్రాక్ట్ చేసే నటుడు కమ్ రౌడీ అని తన ఫ్యాన్స్ ముద్దు గా పిలుచుకునే విజయ్ దేవరకొండకు తెలంగాణ రాష్ట్ర పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ గ్రీన్ చాలెంజ్ విసిరారు.

గ్రీన్ ఛాలెంజ్ పేరుతో గడిచిన ఏడాది కి పైనే మొక్కలు నాటే పనిని షురూ చేశారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ అంతకంత కూ విస్తరిస్తూ నే ఉంది. ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. ఇదే ఛాలెంజ్ ను గతం లో స్వీకరించిన విజయ్ దేవర కొండ అప్పట్లో ఒక మొక్క నాటారు. అప్పట్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ విసిరారు. దీనికి స్పందించిన విజయ్ దేవర కొండ మొక్కను నాటారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన అరవింద్ కుమార్ పీవీ ఘాట్ సమీపంలో మొక్క ను నాటారు. అనంతరం రౌడీ విజయ్ దేవర కొండ కు సవాలు విసిరారు. సీనియర్ ఐఏఎస్ అధికారి.. తెలంగాణ ప్రభుత్వం లో కీలక స్థానం లో ఉన్న అరవింద్ కుమార్ విసిరిన తాజా సవాలుకు రౌడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.