Begin typing your search above and press return to search.
ఇవేం మంత్రివర్గ సమావేశాలు?
By: Tupaki Desk | 3 Jan 2016 5:30 PM GMTతెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే.. ప్రభుత్వాలు లేదా ప్రభుత్వాధినేతలు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు మంత్రివర్గ సమావేశాలను నిర్వహించడం. వాటికి నిర్ణీత షెడ్యూలు అంటే ఏమీ ఉండడం లేదు.
సర్వ సాధారణంగా కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ మంత్రివర్గ సమావేశాలు నిర్ణీత సమయానికి జరుగుతూ ఉంటాయి. ప్రతి నెలా రెండో శనివారం లేదా చివరి శుక్రవారం ఇలా ఏదో ఒక నిర్దిష్ట రోజును నిర్ణయించుకుని.. ఆరోజున తప్పనిసరిగా మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటారు. సర్వసాధారణంగా నెలకోసారి కేబినెట్ మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాగే జరిగింది.
కానీ, రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఎప్పుడో మూడు నాలుగు నెలలకు ఓసారి కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ మొత్తం 50-60 అంశాలపై చర్చిస్తున్నారు. వాటిని ఎంతసేపు చర్చిస్తున్నారు? ఎంత లోతుగా చర్చిస్తున్నారు అని అడిగే కంటే వాటిపై మాత్రం నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అయినా ఇదే చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అయినా ఇదే చేస్తున్నారు. కేబినెట్ సమావేశాలు నిర్దిష్ట సమయానికి జరగకపోవడంతో వెంటనే నిర్ణయాలు జరగాల్సిన అత్యవసర అంశాలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వ స్థాయిలో జరగాల్సినంత చర్చ కూడా జరగడం లేదని విశ్లేషకులు వివరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగూ చర్చలు ఉండడం లేదు. పోనీ కేబినెట్ మీటింగుల్లోఅయినా చర్చిస్తారేమోనని అనుకుంటే ఒక్కో అంశానికి ఐదు పది నిమిషాలు కేటాయిస్తున్నారు. ఉదాహరణకు శనివారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశాన్నే తీసుకుందాం. మొత్తం 11 గంటలు జరిగింది. అందులో మధ్యాహ్న భోజనం, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మనవరాలి వివాహ వేడుకకు వెళ్లి రావడం రెండు గంటలు మినహాయిస్తే 9 గంటలపాటు చర్చ జరిగింది. అంటే మొత్తం 540 నిమిషాలపాటు చర్చించారు. సమావేశంలో 60 అంశాలపై చర్చించారు. అంటే ఒక్కో అంశంపైనా దాదాపు తొమ్మిది నిమిషాలపాటు చర్చించారన్నమాట. ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మినహా ఆ సమయంలోచర్చించేది ఏముంటుంది?