Begin typing your search above and press return to search.
రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్
By: Tupaki Desk | 6 Feb 2023 11:08 AM GMTతెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి హరీష్ రావు రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ ను సభ ముందు ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది.
తెలంగాణ మొత్తం బడ్జెట్ 2.90 లక్షల కోట్లు అని హరీష్ రావు తెలిపారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం 37525 కోట్లు, వ్యవసాయానికి కేటాయింపులు రూ.26831 కోట్లుగా చెప్పారు.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్ల వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7994 కోట్ల నిధులు ఖర్చు చేయగా.. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకూ తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 91వేల 612 కోట్ల రూపాయలు కేటాయించినట్టు పేర్కొన్నారు. అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేశారని పేర్కొన్నారు.
గతంలో ఏ సీఎం చేయని విధంగా రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్దరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం.. భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తారణాధికారుల నియామకం , రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు సమితుల ఏర్పాటు చేశారు.
తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయం, నీటి పారుదల శాఖకు ఎక్కువ కేటాయింపులు చేశారు. ఎస్పీ ప్రత్యేక నిధికి అత్యధిక కేటాయింపులు దక్కాయి. ఏకంగా రూ.36750 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖకు రూ.26885 కోట్లు, వ్యవసాయానికి రూ.26831 కోట్లు, విద్యుత్ కేటాయింపులు రూ.12727 కోట్లు, ఆసరా ఫించన్ల కోసం రూ.12 వేల కోట్లు, దళితబంధు రూ.17700 కోట్లు, ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15233 కోట్లు, బీసీ సంక్షేమం కోసం రూ.6229 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం రూ.2131 కోట్లు కేటాయించారు.
ప్రధాన రంగాల వారీగా ఇవే తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు. ఇందులో దళితబంధు, వ్యవసాయం, నీటి పారుదలకు అగ్రతాంబూలం దక్కింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.