Begin typing your search above and press return to search.
ఆదాయం తక్కువైనా.. భారీగా సారు బడ్జెట్
By: Tupaki Desk | 4 March 2020 4:18 AMకేంద్రం కానీ.. రాష్ట్రం కానీ బడ్జెట్ ప్రవేశ పెడుతుందంటే చాలు.. భారీ ఎత్తున చర్చ జరిగేది. బడ్జెట్ లో కొత్తగా ఏం ఉండనున్నాయి? ఏమేం ప్రకటనలు చేయనున్నారు? ఆదాయం.. ఖర్చుల లెక్కల విషయంలో ప్రభుత్వం ఏం చెబుతుంది? ఇలాంటి క్వశ్చన్లు చాలానే ఉండేవి. గతంలో మాదిరి ఇప్పుడు హాట్ హాట్ చర్చలు జరగకున్నా.. కొద్దిపాటి ఆసక్తి ఉంది.దీనికి కారణం ప్రభుత్వాల అంకెల గారడీనే. చెప్పే మాటలకు చూపించే అంకెలకు పోలిక లేకపోవటం.. ఆదాయం తక్కువగా ఉన్నా భారీ అంచనాల్ని ప్రకటించుకోవటం.. డాబును ప్రదర్శించుకోవటం అంతకంతకూ పెరుగుతోంది. ఇదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారుతోంది.
ఇటీవల కాలంలో ఆదాయం తగ్గుముఖం పట్టిన వేళ.. ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసి నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రభుత్వం.. తన తాజా బడ్జెట్ ను ఎలా రూపొందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను రూ.1.46 లక్షల కోట్ల అంచనాలతో ప్రవేశ పెట్టినప్పటికీ.. వాటిలో ఎక్కువ భాగం ఆచరణ రూపం దాల్చలేదు. అయినప్పటికీ ఈసారి బడ్జెట్ అంచనాల్ని గతానికంటే మరో రూ.12వేల కోట్లు అదనంగా జేర్చి రూ.1.60లక్షల కోట్లతో బడ్జెట్ ను రూపొందించినట్లుగా చెబుతున్నారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. బడ్జెట్ గణాంకాల్లో మాత్రం భారీతనం ఏ మాత్రం మిస్ కాకూడదన్న సారు సందేశాన్ని అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక మందగమనానికి కరోనా తోడు కావటంతో.. గత ఏడాది గణాంకాలకు దగ్గరగా ఉండే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.
ఈసారి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో సాగునీటి రంగానికి రూ.10వేల కోట్ల కంటే తక్కువ కేటాయింపులే ఉంటాయని తెలుస్తోంది. రైతు రుణమాఫీకి మరో రూ.10వేల కోట్లు కేటాయించనున్నారు. రుణమాఫీకి రూ.24వేల కోట్లు అవసరమని బ్యాంకులు అంచనా వేయగా.. గత ఏడాది కేటాయించిన మొత్తానికి మరో రూ.6వేల కోట్ల అదనంగా కేటాయించి ఈ ఏడాది మొదట్లోనే రుణమాఫీ ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
గత ఎన్నికల్లో ఇచ్చిన కొత్త పింఛన్ దారుల హామీ అమలు నేపథ్యంలో రూ.12వేల కోట్లు.. జీతభత్యాలు.. సబ్సిడీలు.. వడ్డీలకు కలిపి రూ.47వేల కోట్ల కేటాయింపులు అవసరమని భావిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు (ఆరోగ్యశ్రీ.. కల్యాణ లక్ష్మీ.. విద్య.. సంక్షేమం.. ఉపకార వేతనాలు తదితర) నిధుల కేటాయింపు గతంలో మాదిరే ఉంటాయని భావిస్తున్నారు. పదవీ విరమణ వయసు పెంపు..నిరుద్యోగ భృతి లాంటి వాటి జోలికి ప్రభుత్వం వెళ్లే అవకాశం లేదంటున్నారు. మొత్తంగా చూస్తే.. బడ్జెట్ మొత్తం వచ్చే ఆదాయానికి మించిన ఖర్చులు సిద్ధంగా ఉండటం తో కొత్త పథకాలు.. ఆలోచనలు బడ్జెట్ లో కనిపించే అవకాశం లేదంటున్నారు.