Begin typing your search above and press return to search.

అతి త్వరలో మార్కెట్లోకి తెలంగాణ బ్రాండ్‌ మాంసం..!

By:  Tupaki Desk   |   5 Feb 2021 1:10 PM GMT
అతి త్వరలో మార్కెట్లోకి తెలంగాణ బ్రాండ్‌ మాంసం..!
X
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాంసం వినియోగ దారులకు నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు త్వరలో తెలంగాణ బ్రాండ్‌ మాంసం విక్రయాలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఎలాంటి కల్తీ లేని నాణ్యమైన మాంసాన్ని అందించేందుకు త్వరలో తెలంగాణ బ్రాండ్ ‌‌తో మాంసం విక్రయాలు జరపనుంది.

శుక్రవారం తన కార్యాలయంలో పశుసంవర్దక శాఖ అధికారులు, వైద్యుల నూతన సంవత్సర కేలండర్‌, డైరీని మంత్రి ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ... నీలి, శ్వేత, పింక్‌ విప్లవాలతో పశుసంవర్ధక శాఖ దేశంలోనే ప్రధమస్థానంలో నిలిచింది అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో రాష్ట్రంలో అపారమైన సంపద సృష్టించ బడిందని మంత్రి తెలిపారు.

జీవాలకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశువైద్య శాలలను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని, ఇలాంటి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న వ్యక్తి కూడా దేశంలో ఏకైక సీఎం కేసీఆర్‌ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో తెలంగాణ పశు సంవర్థక శాఖను ప్రశంసించిందని గుర్తు చేశారు.