Begin typing your search above and press return to search.

త‌ల‌నొప్పి వ‌స్తే త‌ల న‌రుక్కుంటామా కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   17 Jun 2019 5:28 AM GMT
త‌ల‌నొప్పి వ‌స్తే త‌ల న‌రుక్కుంటామా కేసీఆర్‌!
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. ఈ విష‌యం తెలంగాణ అధికార‌ప‌క్షానికి తాజాగా ఎదుర‌వుతున్న ప‌రిణామాలు చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు. ఒక‌ప్పుడు గులాబీ బాస్ ను ఉద్దేశించి ఒక కామెంట్ చేయ‌టానికి రాజ‌కీయ నేత‌లు గ‌డ‌గ‌డా వ‌ణికేవారు. కేసీఆర్ ను ఉద్దేశించి ఏ మాట అంటే అదెలా టిస్ట్ అవుతుందో.. లేనిపోని త‌ల‌నొప్పులు ఎక్క‌డ వ‌చ్చి ప‌డ‌తాయో అన్న సందేహం ప‌ట్టి పీడించేది.

అందుకే కేసీఆర్ ను ఉద్దేశించి తొంద‌ర‌ప‌డి మాట అనేందుకు తెగ ఆలోచించేవారు ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు. కాలం చాలా సిత్ర‌మైంది. ఎవ‌రిని ఎప్పుడు ఎలా మారుస్తుంద‌న్న విష‌యంలో కాలానికి మించిన మాస్ట‌ర్ మ‌రొక‌రు ఉండ‌దు. తాజాగా కేసీఆర్ ప‌లు విష‌యాల్లో టార్గెట్ అయ్యారు. నీతులు చెప్పే కేసీఆర్‌.. ఫిరాయింపుల చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తూ డ‌జ‌ను మంది ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకోవ‌టంపై విప‌క్షాల నుంచి వెల్లువెత్తుతున్న ఆందోళ‌న ఆయ‌న‌కు చిరాకు పుట్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. త‌న‌ను ఇరుకుపెట్టేలా బీజేపీ చేస్తున్న ప్లానింగ్ కేసీఆర్ కు ఒక ప‌ట్టాన జీర్ణించుకోలేక‌పోతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌చ్చిన విజయంతో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం చూపు తెలంగాణ మీద ప‌డిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు స‌రైన ప్ర‌త్యామ్నాయం బీజేపీనేన‌ని.. కాంగ్రెస్ నేత‌లు చెప్పేస్తున్న వేళ‌.. కేసీఆర్ పై అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి క‌మ‌ల‌నాథులు మాట‌ల‌ క‌త్తులు నూరుతున్నారు.

పాల‌నాప‌రంగా కేసీఆర్ చేసే త‌ప్పుల్ని ఎత్తి చూపించే ప్ర‌య‌త్నాన్ని మొద‌లెట్టాయి. ఇందులో భాగంగా కేవ‌లం న‌మ్మ‌కాల కార‌ణంగా స‌చివాల‌యాన్ని కూల్చేసి.. ఆ స్థానంలో కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌న్న అంశంపై ఇప్ప‌టికే బోలెడంత వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు గులాబీ బాస్.

ఇదిలా ఉంటే.. ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. నిండా 40 ఏళ్లు కూడా కాని భ‌వ‌నాల్ని కూల్చేసి కొత్త భ‌వ‌నాలు నిర్మించ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నిస్తున్న ల‌క్ష్మ‌ణ్.. త‌ల‌నొప్పి వ‌స్తే ఉప‌శ‌మ‌నం కోసం మందుబిళ్ల వేసుకుంటామా? లేదంటే త‌ల‌ను న‌రుక్కుంటామా? అంటూ ఆయ‌న అడుగుతున్న ప్ర‌శ్న‌.. స‌రిగా ఉండ‌ట‌మే కాదు.. వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేక మాట‌ల కోసం వెతుక్కునే ప‌రిస్థితిని సృష్టించింద‌ని చెప్పాలి. ఇంత‌కీ త‌ల‌నొప్పికి టాబ్లెట్ వేయాల్సింది పోయి.. త‌ల తీసేసే ధోర‌ణిని కేసీఆర్ ఎందుకు ప్ర‌ద‌ర్శిస్తున్నారు?ముచ్చ‌ట‌గా ఉన్న స‌చివాల‌యం భ‌వ‌నాల్ని సెంటిమెంట్ పేరుతో కూల్చేసి.. వాటి స్థానంలో కొత్త స‌చివాల‌యాన్ని నిర్మించాల‌న్న ఆలోచ‌న‌పై గులాబీ బాస్ వివ‌ర‌ణ ఏమిటి? అన్న‌దిప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటివేళే.. ల‌క్ష్మ‌ణ్ లాంటి నేత‌లు స్వ‌రం పెంచి గ‌ద్దించ‌టం కేసీఆర్ లాంటి అధినేత‌ల‌కు చిరాకు తెప్పించ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.