Begin typing your search above and press return to search.
ఈటల వర్సెస్ బండి: తెలంగాణలో ఫైర్ బ్రాండ్స్.. కర్ణాటకలో తుస్ బ్రాండ్స్!
By: Tupaki Desk | 14 May 2023 12:00 PM GMTకర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం.. బీజేపీ తనకు అందివచ్చిన అన్ని దారులను వినియోగించు కుంది. తన పార్టీ నాయకులు ఎవరు ఉన్నా.. వినియోగించుకుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫైర్ బ్రాండ్ నాయకులను బీజేపీ కర్ణాటకకు తరలించి ప్రచారం చేయించుకుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ప్రచారానికి తెలంగాణకు చెందిన ఫైర్ బ్రాండ్స్ ను కూడా రంగంలోకి దింపింది.
వీరిలో తెలంగాణ బీజేపీ సారథి.. బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడాఉన్నారు. మరి వీరు తెలంగాణలో ఏం మాట్లాడినా ఫైర్ కదా.. మరి వీరి రాజకీయాలు.. ప్రచారం కర్ణాటకలో పనిచేసిందా? అంటే.. తుస్సు మనిపించిందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా వచ్చిన ఫలితాల్లో వీరు ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయి.. సిట్టింగ్ సీట్లు కూడా కోల్పోయింది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కల్బూర్గి రూరల్ జిల్లా సేడం, చించోలి నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. చించోలిలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా, సేడంలో కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా మధుగిరి జిల్లాలోని సిర, మధుగిరి, పవగడ నియోజకవర్గాల ప్రచారంలో నూ పాల్గొన్నారు. ఈ మూడింట్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. వాస్తవానికి ఇవి బీజేపీ సిట్టింగ్ స్థానాలు.
ఇక, బండి సంజయ్.. చింతామణి, ముల్బగల్, బాగేపల్లి, గౌరీబిదనూర్, చిక్కబల్లాపూర్ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న కోలార్, చింతామణి, ముల్బగల్ నియోజకవర్గాల్లో ఆయన చేసిన ప్రచారం బీజేపీ పుట్టి ముంచేసింది. ఇక్కడ కనీసం రెండో స్థానం కాదు కదా.. మూడో స్థానానికే పరిమితమైంది. ఇక గౌరీబిదనూర్‌లో అయితే ఏకంగా ఐదో స్థానానికి.. బాగేపల్లి, చిక్కబల్లాపూర్‌లో భారీ వ్యత్యాసంతో ఓటమి చవిచూసింది. సో.. `ఇట్టుంటది మనతోని` అని అనిపించారంటూ.. బండి.. ఈటలపై కామెంట్లు కురుస్తున్నాయి.