Begin typing your search above and press return to search.
సర్వేలన్నీ.. బీజేపీకే అనుకూలం: బండి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 30 April 2023 6:05 PM GMTతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజం ఇప్పుడు మార్పు కోరుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం అప్పగించేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జరిగిన సర్వేలన్నీ కూడా.. బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. నవంబరు-డిసెంబరు మధ్య జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని బండి సంజయ్ తెలిపారు.
ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ బంజారాహిల్స్లో ప్రసారం చేశారు. దీనికి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ వందసార్లు రేడియో ద్వారా మనందరితో మాట్లాడిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు. ఇంత వరకు ఏ ప్రధాని.. మోడీ తరహాలో చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్‌లో ఏదో ఒక సమస్యపై ప్రజలతో చర్చించారని తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న సమస్యలపై ప్రధాని మాట్లాడారని చెప్పారు.
మోడీ దేశంలో ఇన్ని గొప్ప పనులు చేస్తున్నా.. కొంత మంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం విమర్శిస్తున్నారని కేసీఆర్‌పై పరోక్షంగా బండి మండిపడ్డారు. ప్రధాని మాత్రం ఈ కార్యక్రమాన్ని రాజకీయం కోసం కాకుండా ప్రజల కోసం వినియోగించారని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణాలు తీసుకురాలేదని స్పష్టం చేశారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలను జాగృతం చేసి.. చైతన్యవంతులను చేశారని హర్షం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యలు అంటే కేసీఆర్ పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నూతన సచివాలయం.. సచివాలయం మాదిరిగా కనిపించనందునే ప్రారంభోత్సవానికి వెళ్లలేదన్నారు. సర్వేలన్నీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెబుతున్నాయని వెల్లడించారు. సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని.. కచ్చితంగా విజయం సాధిస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.