Begin typing your search above and press return to search.

బండి సంజయ్ పోటీచేసే నియోజకవర్గం ఇదేనట?

By:  Tupaki Desk   |   1 Feb 2023 8:00 AM GMT
బండి సంజయ్ పోటీచేసే నియోజకవర్గం ఇదేనట?
X
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వచ్చేసారి ఎంపీగా పోటీచేస్తారా? లేక ఎమ్మెల్యేగా చేస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే 2023 డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు అవకాశాలు ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని లీడ్ చేస్తారని ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఆయన పోటీచేసే నియోజకవర్గం ఏదన్నది హాట్ టాపిక్ గా మారింది.

కరీంనగర్ ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీచేసిన బండి సంజయ్ ప్రస్తుత బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయాడు. ఇక ఆ సానుభూతితో కరీంనగర్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. అయితే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తే బండి గెలవడం కష్టమని అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం గట్టిగా ఉండడంతో గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు.

ఇక ఇప్పటికే పలు నియోజకవర్గాల నుంచి బండి సంజయ్ కు ఆహ్వానాలు అందుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే బీఆర్ఎస్ పై వ్యతిరేకత బాగా ఉన్న నియోజకవర్గం వేములవాడ. ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీలో ఉంటారు. ఎప్పుడో ఏడాదికోకసారి అలా టూరిస్టుగా వచ్చి వెళతారు. ఆయన వల్ల పార్టీకి చెడ్డపేరు.. పనులు కాక గులాబీ పార్టీపై వ్యతిరేకత బాగా వ్యక్తమవుతోంది.

అందుకే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత బాగా ఉన్న వేములవాడ నుంచి బండి సంజయ్ పోటీచేయడం ఖాయమైందంటూ ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా మరో నియోజకవర్గం పేరు కూడా బండి సంజయ్ కోసం తెరపైకి వచ్చింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గెలవడం తప్పనిసరి. దీంతో ఆర్ఎస్ఎస్ బండి కోసం స్వయంగా సర్వే చేసి గెలవాల్సిన నియోజకవర్గం ఎంపిక చేసిందట.. అదే కరీంనగర్ అసెంబ్లీ అని తేల్చిందట.. ఈ నియోజకవర్గం బండి సొంత నియోజకవర్గం. కరీంనగర్ లో ప్రతీ గల్లీ బండికి తెలుసు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. ఇక్కడ సమస్యలు లేవనెత్తుతాడనే పేరుంది.

ఇక మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ అసెంబ్లీలో 2009 నుంచి గెలుస్తూనే వస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టాడు. ఈసారి గెలుపు కష్టమని.. వ్యతిరేకత బాగా వచ్చిందని సర్వేలో తేలిందట.. అందుకే కరీంనగర్ లోనే బరిలోకి దిగాలని బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీగా ఉండడం బండికి కలిసి వచ్చిందని.. ఈసారి గంగులను ఓడించి సీఎం రేసులో నిలవాలని బండి సంజయ్ కలలుగంటున్నాడు. అయితే గంగులను ఓడించడం అంత ఈజీ కాదని.. బండి అనవసరంగా ఇక్కడ పోటీచేసి రిస్క్ చేస్తున్నాడని కొందరు విశ్లేషకులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.