Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ కు బీజేపీనే అస్త్రాన్ని అందించిందా ?
By: Tupaki Desk | 5 July 2023 11:13 AM GMTతెలంగాణాలో ఇపుడు కాంబినేషన్ల ఆరోపణలు జోరుగా ఉన్నాయి. కాంబినేషన్ల ఆరోపణలంటే ఏ రెండుపార్టీలు ఒకటే అని. బీజేపీయేమో కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒకటే అని పదేపదే ఆరోపణలు చేస్తోంది. దీన్ని కాంగ్రెస్ తిప్పికొడుతు బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అని ఎదురుదాడిచేస్తోంది. ఇదే సమయంలో కేసీయారేమో తాము ఏ పార్టీకి బీ టీం కాదని మొత్తుకుంటున్నారు. వీళ్ళ ఆరోపణల్లో నిజాలు ఎంతున్నాయన్నది పార్టీల అధినేతలకే తెలియాలి.
అయితే బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు మద్దతిచ్చేదిగా నిలిచింది. విషయం ఏమిటంటే బీజేపీ తెలంగాణా అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది అగ్రనాయకత్వం.
కేసీయార్ తో పాటు ఆయన కుటుంబంపై బండి పదేపదే విరుచుకుపడేవారు. చేసే ఆరోపణలు, విమర్శలు ఎంతవరకు నిజమన్నది పక్కనపెట్టేస్తే ప్రతిరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బండి పదేపదే టార్గెట్ చేసేవారు.
నిజానికి బీజేపీ క్యాడర్లో ఉత్సాహం వచ్చిందే బండి అధ్యక్షుడిగా అపాయింట్ అయిన తర్వాత. అంతకుముందు లక్ష్మీణ్ సారధ్యంలో పార్టీ చాలా స్తబ్దుగా ఉండేది. అలాంటిది బండి వచ్చిన తర్వాత ఒక్కసారిగా స్పీడు పెరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత కేంద్రంగా రాజకీయాలు మారిపోయాయి.
కవిత అరెస్టు ఖాయమని బండితో పాటు చాలామంది నేతలు పదేపదే టార్గెట్ చేశారు, అలాంటిది కవిత అరెస్టు జరగలేదు. దాంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టే కవిత అరస్టు జరగలేదని దాడి మొదలుపెట్టారు.
కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టలేక బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేతులెత్తేశారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ నేపధ్యంలోనే తెరవెనుక జరిగిన ఒప్పందం కారణంగానే నరేంద్రమోడీ కేసీయార్ అసలు నోరెత్తటమే లేదనే ఆరోపణలున్నాయి.
అలాగే బీజేపీ నేతలు కూడా కేసీయార్ తో పాటు లిక్కర్ స్కామ్ ను ప్రస్తావించటం లేదు. ఇది సరిపోదన్నట్లు ఇపుడు బండిని కూడా మార్చేశారు. దీంతో తమ ఆరోపణలు నిజమే అని చెప్పుకునేందుకు కాంగ్రెస్ కు బీజేపీయే మంచి అస్త్రాన్ని అందించినట్లయ్యింది.