Begin typing your search above and press return to search.
ఔను.. ఎంపీ నిధులు సొంతానికి వాడుకున్నా.. ?!
By: Tupaki Desk | 20 Jun 2023 11:00 AM GMTపార్లమెంటు సభ్యులుగా ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఏటా 5 కోట్ల రూపాయల వరకు నిధులు ఇస్తుంది. అంటే.. మొత్తం ఐదేళ్లలో 25 కోట్ల వరకు వీరికి నిధులు అందుతాయి. వీటిని వారి వారి నియోజకవర్గాల్లో ఖర్చు చేసుకుని.. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎంపీ లాడ్స్(ఎంపీ నిధులు) అనే పథకాన్ని ప్రారంభించారు. దీనిని తర్వాత ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. దీనిలో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా.. కేవలం కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నిధులను ఖర్చు చేయాలనే నిబంధనను మాత్రమే పెట్టారు.
అయితే.. ఈ ఎంపీ నిధులను ఎంపీలు తలకోరకంగా ఖర్చు చేస్తున్నారు. దీంతో ప్రజలకు సరైన విధంగా ఈ నిధులు ఉపయోగ పడడం లేదనే విమర్శలు తరచుగా వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఎంపీ ల్యాడ్స్ నిధులపై తెలంగాణ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ ల్యాడ్స్ను తన ఇంటి నిర్మాణంతో పాటు కొడుకు పెళ్లి కోసం కూడా వాడుకున్నానని బాపురావు ప్రకటించారు. ప్రతిపక్ష నేతల పై ఆయన నిప్పులు చెరిగారు.
తాజాగా జిల్లాలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎంపీలు మొత్తం నిధులు సొంతానికి వాడుకున్నారని.. తాను మాత్రం కొన్ని నిధులు మాత్రమే వాడుకున్నట్లు బహిరంగంగా ఒప్పుకొన్నారు.
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అర్వింద్ల కంటే తనకే ఎక్కువ నిధులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిధులను కార్యకర్తలందరికీ సమానంగా కేటాయిస్తానంటూ ఎంపీ బాపురావు వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనం గా మారింది. వాస్తవానికి పార్టీకి సొంతానికి.. పార్టీ కార్యకర్తలకు ఈ నిధులు వాడకూడదు. కానీ బాపూరావు మాత్రం వాడుకుంటానని చెప్పారు.
ప్రస్తుతం ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన ఎంపీ ల్యాడ్స్ను ఇష్టానుసారంగా ఎలా వాడుకుంటారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రజల కోసం ఖర్చు చేయకుండా సొంత ప్రయోజనాలకు ఎంపీ నిధులను వాడటం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బాపురావుపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంపీ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల కూడా షాక్కొట్టినట్లైంది. మరి ఎంపీ బాపురావు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.