Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లా మారుతున్న తెలంగాణ బీజేపీ?
By: Tupaki Desk | 14 March 2023 10:43 AM GMTతెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తంగా మారుతున్నాయి. నిన్నటి వరకు ఈ రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న వర్గ విభేదాలతో ఆ పార్టీ ఇక బాగుపడతు అని కొందరు విమర్శించారు. పార్టీ డెవలప్మెంట్ అటుంచి.. తమ వర్గం వారే ఎదగాలన్న ఆలోచనతో రాజకీయాలు చేశారు. ఇప్పుడు బీజేపీలో అదే పరిస్థితి నెలకొంది. కొన్ని నెలలుగా అంతర్గతంగా రగులుతున్న విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా ఎంపీ అర్వింద్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అమిత్ షా రాష్ట్ర నేతలను పిలిపించుకొని వర్గ విభేదాలకు పోకుండా కలిసి పనిచేయాని సూచించారు. కానీ ఇంతలోనే వర్గ విభేదాలు బయటపడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సాధారణంగానే బీజేపీ విమర్శలు చేస్తోంది ఈ తరుణంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను రెండు రోజుల పాటు బీఆర్ఎస్ నాయకులు సైతం లైట్ గానే తీసుకున్నారు. కానీ ఆ తరువాత వాటిని హైలెట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ దిష్టిబొమ్మలు తగలబెట్టే పరిస్థితికి వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ అర్వింద్ సైతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు.
పార్టీ అధ్యక్షుడి పదవి అంటే పవర్ స్టేషన్ కాదని, వ్యాఖ్యలు జాగ్రత్తగా రావాలని సూచించారు. అయితే అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీలోనే కొందరు విమర్శిస్తున్నారు. అర్వింద్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజయశాంతితో పాటు రాజాసింగ్ అన్నారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందా? అన్న చర్చసాగుతోంది. తెలంగాణలో ఇప్పుడిప్పుడు ప్రాణం పోసుకుంటున్న బీజేపీలో అప్పుడే వర్గ పోరు ప్రారంభం కావడం కేడర్లో ఆందోళనకు గురి చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కొందరు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారని, వీరిలో ఎంపీ అర్వింద్ ఒకరని అర్థమవుతోంది.
ఈ పరిస్థితిని ముందే గమనించిన అమిత్ షా రాష్ట్ర నేతలను పిలిపించుకొని సమావేశం నిర్వహించారు. గ్రూపు విభేదాలు పక్కనబెట్టి పనిచేయాలని సూచించారు. మరోవైపు చేరికల కమిటీ చైర్మన్ గా నియమించిన ఈటల రాజేందర్ సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీల నుంచి తాను చాలా మంది తీసుకొస్తానని మందు హామీ ఇచ్చిన ప్రకారం ఆయన పనిచేయడం లేదని కొందరు పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
మొన్నటి వరకు ఈ పరిస్థితి కాంగ్రెస్ లోనే ఉందనుకున్నారు. ఇప్పుడు బీజేపీలోనే సేమ్ సీన్ రిపీట్ కావడం ఆసక్తిగా మారిందని అంటున్నారు. బండి సంజయ్ ని కొందరు సపోర్టు చేస్తుంటే అర్వింద్ వర్గం వేరే తయారవుతోందని అంటున్నారు. అటు ఈటల రాజేందర్ సైతం ప్రత్యేక వర్గాన్ని తయారు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కేడర్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.