Begin typing your search above and press return to search.

మరీ అన్ని రోజుల అసెంబ్లీ ఏమిటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   18 Aug 2020 6:30 PM GMT
మరీ అన్ని రోజుల అసెంబ్లీ ఏమిటి కేసీఆర్?
X
కరోనా కారణంగా వాయిదా పడిన అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్ని ఎప్పుడు నిర్వహించాలన్న అంశం పై చర్చ జరిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అనేక ముఖ్య విషయాల మీద చర్చలు జరిపి.. నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున వర్షాకాల సమావేశాల్ని నిర్వహించాలని నిర్ణయించారు.

వచ్చే నెల ఐదు నుంచి ఇరవై రోజుల పాటు సభా కార్యక్రమాల్ని నిర్వహించాలని భావిస్తున్నరు. కనీసం మూడు వారాలకు తగ్గకుండా సమావేశాల్ని నిర్వహించటం ద్వారా.. కీలకమైన అంశాలపై చర్చ జరిపేందుకు వీలు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. మంత్రులు కూడా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాల పై నిర్ణయాలు తీసుకోవటానికి.. ప్రకటనలు చేయటానికి ఈ మాత్రం సమయం అవసరమన్న భావన వ్యక్తమవుతోంది.

అయితే..కరోనా టైం కావటంతో సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా అసెంబ్లీ హాలును సిద్ధం చేయాలని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించటం తప్పు లేదు. కానీ.. ఇరవై రోజులు అంటే మాత్రం ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంత కాలం సమావేశాల్ని నిర్వహించటం కంటే కూడా.. ఫాస్ట్ ట్రాక్ లో వారానికి కుదిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. భారీ ఎత్తున భద్రతా సిబ్బందితో పాటు.. అధికారులు.. నేతలు.. వారి సంబంధీకులు ఎక్కువ గా ఉండే వేళ లో.. వీలైనంత తక్కువ రోజుల్లో అసెంబ్లీ సమావేశాల్ని ముగిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.