Begin typing your search above and press return to search.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అప్పుడే!
By: Tupaki Desk | 28 Jun 2023 1:02 PM GMTఈ ఏడాది చివరిలోగా ఐదు రాష్ట్రాలు.. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీసగఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. గత పర్యాయం ఐదేళ్ల పదవీ కాలానికి ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి అలా చేయలేదు. పూర్తిగా ఐదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయనేది తేలిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు తిరిగి వెళ్తూ నవంబర్ లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉన్నతాధికారులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అంటే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు డిసెంబర్ లో జరగాల్సి ఉండగా ఒక నెల ముందుగా నవంబర్ లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధపడుతోందని చెబుతున్నారు.
దీనికి కారణం లేకపోలేదని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. అందుకోసమే తెలంగాణ ఎన్నికలను డిసెంబర్ కు బదులుగా ఒక నెల ముందుగా నవంబర్ లోనే నిర్వహించనున్నారని సమాచారం.
నవంబర్ లో ఎన్నికలు జరిగితే అక్టోబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణా అసెంబ్లీకి గడువు 2024 జనవరి 16 వరకు ఉంది. ఈ గడువు తేదీ మించకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి నవంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. పోయినసారి ముందస్తు ఎన్నికలకు 2018 నవంబర్ 10న నోటిఫికేషన్ ఇచ్చారు. డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది.
కాగా తెలంగాణతోపాటు ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 6, మిజోరం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీసగఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3, రాజస్తాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ముఖ్యంగా ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాలకు సూచించినట్టు సమాచారం. వీటిలో తెలంగాణ కూడా ఉంది.
ఒకేసారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం కత్తిమీద సాముతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఒకదాని తర్వాత ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ లోనే షెడ్యూల్ ఇచ్చి నవంబర్ లో ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఆయా పార్టీలు కూడా ఇందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మేనిఫెస్టోల రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, ప్రకటనపైన కూడా దృష్టి సారించేశాయి.