Begin typing your search above and press return to search.

తెలంగాణ యాపిల్స్ వచ్చేస్తున్నాయ్

By:  Tupaki Desk   |   9 Nov 2019 7:15 AM GMT
తెలంగాణ యాపిల్స్ వచ్చేస్తున్నాయ్
X
యాపిల్ అన్నంతనే అయితే సిమ్లా లేదంటే కశ్మీర్ గుర్తుకు వస్తుంది. శీతల ప్రాంతాల్లో తప్పించి మరెక్కడా పండని యాపిల్స్ కు ఇప్పుడు తెలంగాణ లో కేరాఫ్ అడ్రస్ గా మారనుంది. ప్రయోగాత్మకం గా తెలంగాణ లో యాపిల్స్ ను పండిస్తున్నారు. తెలంగాణ కు చెందిన ఔత్సాహిక రైతు ప్రయోగాత్మకం గా యాపిల్ పంటను పండించేందుకు వీలుగా ప్రయత్నాలు షురూ చేశారు.

కుమురం భీం జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామాని కి చెందిన బాలాజీ అనే రైతు రెండు ఎకరాల్లో యాపిల్ పంటను సాగు చేస్తున్నారు. తనకు చెందిన రెండు ఎకరాల విస్తీర్ణం లో యాపిల్ పంటను పండించగా.. మొక్కలు ఏపుగా పెరిగాయి.
తెలంగాణ లో మొక్కలు నాటేందుకు నవంబరు..డిసెంబరు సరైన కాలంగా చెబుతున్నారు. ఉష్ణ మండల ప్రాంతా ల్లో పండే యాపిల్ వంగడాలను నాటటంతో తెలంగాణ లోనూ పంట పండే పరిస్థితి. రాత్రిపూట 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో యాపిల్ పంటకు అనుకూలం గా ఉంటుందని చెబుతున్నారు.

రానున్న రోజుల్లో అదిలాబాద్.. భద్రాద్రి కొత్త గూడెం.. జనగాం.. జయ శంకర్ర భూపాల పల్లి.. ములుగు.. కామా రెడ్డి.. కరీంనగర్.. కుమురం భీం ఆసిఫా బాద్.. మేడ్చల్.. నిజామా బాద్.. సూర్యా పేట తదితర జిల్లాల్లో యాపిల్ పంటకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. యాపిల్ మొక్కల్ని తెచ్చి నాటిన నాటి నుంచి మూడేళ్ల తర్వాత పండ్లు కాయటం మొదలవుతుంది. తక్కువ పెట్టు బడి.. నిర్వహణ వ్యయంతో యాపిల్ పంటకు అవకాశం ఉందంటున్నారు.

తొలి ఐదేళ్ల లో యాపిల్ మెక్కల మధ్య అంతర పంటలు గా కూరగాయలు.. ఇతర పంటలు వేసుకొని లాభం పొందే వీలుందని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యానవన శాఖ సైతం ప్రత్యేక శ్రద్ధ చూపించటం తో పాటు.. యాపిల్ పంట పండించే వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలంగాణ యాపిల్స్ పెద్ద ఎత్తున రావటం ఖాయమంటున్నారు.