Begin typing your search above and press return to search.
దేశ వ్యాప్తంగా జీఎస్టీ దూకుడు: అదరగొట్టిన ఏపీ.. తగ్గిన తెలంగాణ
By: Tupaki Desk | 2 Oct 2020 7:32 AM GMTప్రపంచాన్ని వణికించిన మహమ్మారి.. దేశాన్ని.. దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన ఆర్నెల్లలో సెప్టెంబరు మినహాయిస్తే.. మిగిలిన ఐదు నెలలు పరిస్థితి భయం.. భయంగా నడిచిన విషయం తెలిసిందే. మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. అందుకు భిన్నంగా వర్షాలు విస్తారంగా కురవటం.. వాతావరణం అనుకూలించటంతో పంటలు భారీగా పండాయి. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తించటమే కాదు.. కరోనాతో కలిసి బతికే అలవాటు చేసుకునే దిశగా ప్రభుత్వాలు.. ప్రజలు మారుతున్నాయని చెప్పాలి.
దీనికి సంకేతంగా తాజాగా వెలువడిన జీఎస్టీ వసూళ్లు చెప్పకనే చెప్పేస్తాయని చెప్పాలి. కరోనా ముందు హడావుడి లేకున్నా.. సెప్టెంబరులో పరిస్థితి మాత్రం బాగా మెరుగుపడిందని చెప్పాలి. ప్రజల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబరులో జీఎస్టీ వసూళ్లు దేశ వ్యాప్తంగా పెరగటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.
గత ఏడాదితో పోలిస్తే.. ఐదు శాతం అదనంగా జీఎస్టీ వసూళ్లు సాగాయి. పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు సైతం గత సెప్టెంబరుతో పోలిస్తే రెండు శాతం పెరగటం విశేషం. ఇప్పటికి పూర్తిస్తాయి రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానప్పటికీ.. పన్ను ఆదాయం పెరగటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆగస్టుతో పోలిస్తే.. సెప్టెంబరులో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 10.5 శాతం పెరిగినట్లుగా చెబుతున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక.. ఢిల్లీ.. తెలంగాణ మినహాయిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ వసూళ్లు పెరగటం గమనార్హం.
ఏపీలో జీఎస్టీ ఆదాయం ఎనిమిది శాతం పెరిగింది. కోవిడ్ కేసులు భారీగా నమోదు అవుతున్నా.. పన్ను ఆదాయం పెరుగుదల ఆ రాష్ట్రానికి భారీ ఊరటనిచ్చిందని చెప్పాలి. అదే సమయంలో తెలంగాణ మాత్రం వెనుకబడి ఉండటం గమనార్హం. గత సెప్టెంబరుతో పోలిస్తే..తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ ఆదాయం ఇంకా నెండు శాతం తక్కువగా ఉండటం గమనార్హం. పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకపోవటం కూడా కారణంగా చెప్పాలి. కోవిడ్ షాక్ నుంచి హైదరాబాద్ మహానగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వరుస పండుగలు ఉండే అక్టోబరులో పాత కళను కొత్తగా సంతరించుకునే అవకాశం ఉంది.