Begin typing your search above and press return to search.

సుపరిపాలనలో అట్టడుగు స్థానాల్లో తెలంగాణ, ఏపీ..

By:  Tupaki Desk   |   26 Dec 2021 5:05 AM GMT
సుపరిపాలనలో అట్టడుగు స్థానాల్లో తెలంగాణ, ఏపీ..
X
వ్యవసాయ అనుబంధ రంగాలు, వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన ర్యాంకులను ప్రకటించింది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్యం, మాన వనరుల అభివృద్ధి, ఆర్థిక పరిపాలన, తదితర 10 అంశాల్లో సాధించిన పురోగతి ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తుంది. ఇందులో భాగంగా 2021 సంత్సరానికి గ్రూప్ -ఏలో టాప్ 10లో తెలుగు రాష్ట్రాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. ఈ అంశాల్లో తెలంగాణకు 9 వ స్థానం దక్కగా, ఏపీ 10 ప్లేసులో నిలిచింది. కాగా ఇందులో మొదటి స్థానం గుజరాత్ ఉండగా.. ఆ తరువాత మహారాష్ట్ర, గోవా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వాజ్ పేయి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25న ఈ ర్యాంకులను ఇస్తోంది.

ఈసారి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలోని రాష్ట్రాలనను గ్రూప్ -ఏ, గ్రూప్-బిగా విభజించారు. గ్రూప్ -ఏలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, హర్యానా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. అయితే గ్రూప్ -ఏలోని 10 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి 4,842 స్కోరుతో 9వ స్థానంలో నిలిచింది. అయితే కొన్ని రంగాల్లో తెలంగాణ గ్రోత్ పెరిగింది. మరి కొన్ని రంగాల్లో మాత్రం వెనకబడింది. వాణిజ్యం, పరిశ్రమల రంగంలో 0.699 తో తెలంగాణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే సాంఘిక సంక్షేమంలోనూ 0.617 స్కోరు వచ్చింది. అయితే ప్రజా మౌలిక సదుపాయాల స్థానంలో 0.793 ర్యాంకుతో 2వ స్థానంలో నిలిచింది, ఆర్థిక పరిపాలన రంగంలోనూ 0.632 తో రెండో ర్యాంక్ సాధించింది.

ఇక ఆంధ్రప్రదేశ్ 4,470 ర్యాంకుతో 10 ప్లేసులో నిలిచింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మాత్రం ఏపీ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ రంగాల్లో రాష్ట్ర వృద్ధి రేటు జీజీఐ 2019లో 6.3 రశాతం ఉండగా ఇప్పుడు 11.3 శాతానికి పెరిగింది. రాష్ట్ర ఉద్యానవన పంటల ఉత్పత్తి వార్షిక వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 12.3 శాతానికి పెరిగింది. పాల ఉత్పత్తిలో 1.4 శాతం నుంచి 11.7 శాతానికి పెరిగింది. మాంసం ఉత్పత్తికి సంబంధించిన వృద్ధి రేటులో గణనీయమైన మార్పు నమోదైంది. 6.7 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగింది. అయితే వాణిజ్యం, పరిశ్రమ రంగాల్లో మాత్రం ఏపీ వెనుకబడింది. అయితే ప్రభుత్వ రంగ హాస్పిటల్ లో ఉండే వైద్యుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. 2019లో 90.21 శాతం ఉన్న డాక్టర్ల సంఖ్య ఇప్పుడు 96.61 శాతానికి చేరింది. దీంతో ప్రజల్లో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరిగింది. దీంతో మాతృ, శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. వీటిలో మాతృ మరణాలు 74 నుంచి 65కు తగ్గతే శిశు మరణాల రేటు 32 నుంచి 29కి తగ్గాయి.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెరుగైన పాలన కనిపించినట్లు తెలుస్తోంది. 2019తో పోలిస్తే గుజరాత్ 12 శాతం గోవా 25 శాతం అభివృద్ధి సాధించినట్లు నివేదిక తెలుపుతోంది. ఉత్తరప్రదేశ్ 9 శాతం అభివృద్ధి ఎక్కువగా సాధించింది. జమ్మూకాశ్మీర్లో 3.7 శాతం పుంజుకోగా, మహారాష్ట్రలో వ్యవసాయం, మాన వనరుల అభివృద్ధి, సాంఘిక సంక్షేమం, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల్లో గోవా ముందంజలో ఉంది. జార్ఘండ్ కూడా 12.6 శాతం అభివృద్ధి సాధించడం విశేషం. అయితే రాజస్థాన్ 1.7 శాతమే గ్రోత్ పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే మిజోరాం ప్రజారోగ్యం, పరిశ్నమలు, మానవ వనరుల లభ్యత వంటి అంశాల్లో పురోగతి సాధించినట్లు నివేదిక సమర్పించారు.కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.