Begin typing your search above and press return to search.
కొట్టుకోవడానికి మరో పాయింటు దొరికింది!
By: Tupaki Desk | 20 Jan 2015 5:29 PM GMTచిన్న చిన్న వ్యవహారాలను అంతర్జాతీయ వివాదాల స్థాయిలో ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరిగేలా మార్చేసుకోవడంలో.. ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగానే వ్యవహరిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టుకోవడానికి పరస్పరం ఒకరినొకరు తిట్టిపోసుకుంటూ.. వారిది తప్పంటే వారిది తప్పంటూ ఆడిపోసుకోవడానికి అనువుగా ఏ పాయింటు దొరుకుతుందా అని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ నిత్యం వెతుకులాటలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే జలాల దగ్గరినుంచి ఉన్నత విద్యామండలి, వ్యవసాయ యూనివర్సిటీ, వివిధ సెట్ పరీక్షల నిర్వహణ వంటి విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్యన ఏ స్థాయిలో తగాదాలు చెలరేగుతున్నాయో అందరికీ తెలిసిన సంగతే. తాజాగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తాము మరికొంత కాలం తిట్లతో కాలం గడిపేయడానికి మరో అంశాన్ని వేదికగా చేసుకుంటున్నారు! అదే ఆరోగ్యశ్రీ!!
ఆరోగ్య శ్రీ పథకం అనేది.. ఇప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య విభజనకు నోచుకోని సంస్థల జాబితాలోనే ఉన్నది!! ఆ ఒక్క పాయింటు చాలన్నట్లుగా ఇరు రాష్ట్రాల వారు ఆరోగ్యశ్రీ వేదికగా కతుతష్ట్ర్లఉ దూసుకోవడానికి సిద్ధం అవుతున్నాయి. దాని నిర్వహణ అధికారం మాదంటే మాదంటూ.. మాటలు రువ్వుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకానికి రెండు ప్రభుత్వాలు కూడా ఐఏఎస్ అధికార్లను నియమించేశాయి. జ్యోతిబుద్ధప్రసాద్‌ను దీనికి ఇన్చార్జిగా తెలంగాణ ప్రభుత్వం నియమించగా, లవ్ అగర్వాల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లుగానే... ఒక ట్రస్టులో చీఫ్ పొజిషన్‌కు రెండు ప్రభుత్వాలు ఇద్దరు అధికార్లను వేసేశాయి. అక్కడితో చికాకు షురూ అయింది.
ఇప్పటికే అనేక అంశాలపై వివాదాలను తయారుచేసుకుంటున్న ప్రభుత్వాలు మళ్లీ మరో అంశంతో ముందుకు వచ్చాయని అందరూ అంటున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టుపై అధికారం మాదంటే మాదంటూ.. ఇరు ప్రభుత్వాలూ మళ్లీ గవర్నరుకు ఫిర్యాదు చేసుకోవడాలూ... నిందారోపణలు చేసుకోవడాలూ రాబోయే రోజుల్లో చూడక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.