Begin typing your search above and press return to search.
నిజం; ఎవరు పత్తిత్తులు..?
By: Tupaki Desk | 17 March 2015 6:48 AM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాలను చూస్తే.. అందరూ శాఖాహారులే.. బుట్టలో ఉండాల్సిన చేపలు మాత్రం మాయమయ్యాయిన్న రీతిలో ఉంది. ఎవరికి వారు తాము ఎంత నికార్సు తెలంగాణవాదులో అన్న విషయాన్ని చెప్పుకునేందుకు శ్రమపడ్డారు.
ఎవరికి వారు ఎదుటివారిపై విమర్శలు చేస్తూ.. తప్పును మీద పడేసే ప్రయత్నం చేశారు. వీరి వేదన.. ఆవేదన చూసిన వారికి నవ్వు తెప్పించకమానదు. రాజకీయాల్లో ఎవరికి కమిట్‌మెంట్ ఉండదన్న విషయం మరోసారి నిరూపితమైంది. రాష్ట్ర విభజన సమయంలో అన్నీ పార్టీలు కలిసి ఏ విధంగా అయితే ఏపీ గొంతు నులిమేశాయో.. అదే తీరుతోతెలంగాణలో విషయంలో వ్యవహరించాయని చెప్పకతప్పదు.
పోలవరం ముంపు మండలాలకు సంబంధించి ఏడు మండలాలకు సంబంధించిన అంశం తెలంగాణ అసెంబ్లీ తీవ్ర చర్చ జరగటం తెలిసిందే.ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ ఒకరి మీద ఒరు దుమ్మెత్తిపోసుకోవటం తెలిసిందే.
ఇంతకీ పోలవరం ముంపు గ్రామాలు ఏపీలో కలిపే విషయంలో తప్పు ఎవరిది? అందుకు బాధ్యులు ఎవరు అన్న విషయాల్లోకి వెళితే.. విషయాన్ని 1956 నుంచి స్టార్ట్ చేయాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి.. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధినాయకత్వం వర్కింగ్ కమిటీతో కలిపి నిర్ణయం తీసుకున్న వరకూ కూడా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట చెప్పేవారు.1956కు ముందు ఏదైతే తెలంగాణ ఉందో.. ఆ తెలంగాణ కోసమే తన పోరాటమని చెప్పుకునే వారు.
తెలంగాణరాష్ట్ర ప్రకటన వెలువడిన వెంటనే.. ఎవరికి వారు లెక్కల్లోకి వెళ్లిపోయారు. 1956 ముందు వరకు తెలంగాణ రాష్ట్ర పరిధిలో లేని.. ఇప్పుడు తెలంగాణ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాలోని భద్రాచలం రెవెన్యూ డివిజన్ కూడా తెలంగాణతో పాటు ఇవ్వాలంటూ కొత్త రాగం తీసింది ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి.. నాటి ఉద్యమనేత కేసీఆరేనని చెప్పక తప్పదు.
విభజన విషయంలో అప్పటివరకూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రులు.. 1956 నాటి తెలంగాణ మాటకు భిన్నమైన మాట వినిపించటంతో కస్సుమన్నారు. కానీ.. తన వాదనా పటిమతో సరికొత్త వాదనను వినిపించి.. మొత్తానికి భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను సైతం తెలంగాణలో ఉంచేలా చేయటంలో కాంగ్రెస్.. కేసీఆర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్పాలి. నిజంగా భద్రాచలం డివిజన్‌ను ఏపీకి ఇచ్చే విషయంలో సోనియమ్మ పట్టుదలతో ఉంటే కేసీఆర్ కాదనేవారు కూడా. ఒక్క భద్రాచలం మాత్రమే కాదు.. తెలంగాణరాష్ట్రం కావాలంటే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తేనే అని షరతు విధించినా ఒప్పుకునే పరిస్థితి. ఈ విషయం రాజకీయ నేతల నుంచి.. నాటి ఉద్యమాన్ని కవర్ చేసిన మీడియా మిత్రులందరికి తెలిసిన బహిరంగ రహస్యం.
ఎప్పుడైతే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇచ్చే విషయంలో సోనియమ్మ ఒక నిర్ణయం తీసుకున్నారన్న పక్కా సమాచారం తీసుకున్న నాటి నుంచి కేసీఆర్ తన వాయిస్‌ని మరింత పెంచారు. విభజన వల్ల జరిగిన నష్టం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ పరిధిలో ఉండే ఏడు మండలాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని గుర్తించి.. వాటిని ఏపీకి ఇవ్వాలంటూ నిర్ణయాన్ని తీసుకున్నారు. కాకపోతే.. విభజన బిల్లు నాటికి ఆ విషయాన్ని గుర్తించలేదు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన ఊపులో ఏడు మండలాల గురించి టీఆర్‌ఎస్ పెద్దగా పట్టించుకోకపోతే.. కాంగ్రెస్.. బీజేపీలు పోలవరంపై ఇచ్చిన హామీ మేరకు ఇది తప్పదన్న విషయాన్ని గుర్తించి గమ్మున ఉంది. జరిగింది ఇదైతే.. దీనికి ఎవరికి వారు.. తప్పుమీదంటే మీదంటూ వాదులాడుకోవటం చిత్రమైన విషయం. ఈ మొత్తం వ్యవహారాన్ని సాపేక్షంగా చూసినప్పుడు అందరూ పత్తిత్తులే అయితే.. ఏడు మండలాలు ఎందుకు చేజారి పోయాయో..?