Begin typing your search above and press return to search.
వారు చెప్పకపోయినా.. విషయం దాగలేదు బ్రో.. విషయం ఏంటంటే!!
By: Tupaki Desk | 26 Jun 2023 5:22 PM GMTతెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కీలక నాయకులుగా ఉన్న మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడులో రాజీనామా చేసి.. తిరిగి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు.. కొన్నాళ్లుగా ఆ పార్టీలో ఉన్నామనే చెబుతున్నారు.
కానీ, ఉంటున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో వారు పార్టీలు మారతారనే ప్రచారం జరిగింది. కానీ, వారు మాత్రం ఖండిస్తూనే ఉన్నారు. ఆ.. అదేం లేదని చెబుతున్నారు.
కానీ, విషయం ఇప్పుడు క్లారిటీ వచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు.
అయితే.. ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ సభకు ఈ ఇద్దరు నాయకులు డుమ్మా కొట్టారు. పోనీ.. ఒకరు హాజరై.. మరొకరు ఏదో పని ఉందని అనుకుంటే.. దీనిని అర్ధం చేసుకోవచ్చు. కానీ.. ఇద్దరూ కూడా.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో వీరు పైకి చెప్పకపోయినా.. విషయం మాత్రం బయట పడిపోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఈ పరిణామాలతో బీజేపీని వీరిద్దరూ వీడడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోందని పరిశీలకులు చెబుతు న్నారు.శనివారం కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో భేటీ తర్వాత ఇద్దరూ పార్టీని వదిలేయాలని కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ నిర్వహించిన 'ఇంటింటికీ బీజేపీ'కార్యక్రమానికి వీరిద్దరూ డుమ్మా కొట్టినప్పటి నుంచే అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక, ఇప్పుడు స్పష్టమైందని అంటున్నారు పరిశీలకులు.