Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ ని ఫుల్ గా వాడేస్తున్న తెలంగాణ!

By:  Tupaki Desk   |   3 May 2020 2:30 PM GMT
లాక్ డౌన్ ని ఫుల్ గా వాడేస్తున్న తెలంగాణ!
X
ప్రపంచమంతా మూతపడింది. ఎక్కువ మంది బతికిబట్టకడితే చాలు అనుకుంటున్నారు. దేశాలు - రాష్ట్రాలకు ఖర్చులున్నాయి గాని ఆదాయాలు లేవు. హెల్త్ కేర్ - మెయింటెనెన్స్ భారంగా మారిపోయింది. దీంతో ఒత్తిడిలో ఉన్న ప్రభుత్వాలు కోవిడ్ ని తరిమేయడంలోనే తలమునకలు అవుతున్నాయి. తెలంగాణ మాత్రం ఒకవైపు కోవిడ్ తో పోరాడుతూనే మరోవైపు పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి భలే ఛాన్సులే అనుకుంటోంది. సాధారణంగా రోడ్ల పనుల వల్ల నిత్యం ట్రాఫిక్ జాంలు అవుతుంటాయి. పైగా పనులు కూడా సరిగా వేగంగా సాగవు. అయితే... లాక్ డౌన్ లో అవన్నీ కంప్లీట్ చేస్తే... ఎలా ఉంటంది అన్న ఆలోచన వచ్చిన తక్షణం పనులు మొదలెపెట్టేసింది సర్కారు.

రోడ్ల మరమ్మతులు - కొత్త రోడ్లు వేయడం - సుందరీకరణ పనులు... కూడళ్ల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇపుడు ఆదాయం లేకపోయినా... ఇప్పటికే నిధులు కేటాయించిన పనులు కావడం వల్ల నిరాటంకంగా సాగుతున్నాయి. కేబీఆర్ పార్కు జాతీయ పక్షి నెమళ్లకు ఫేమస్. వాటికి చిహ్నంగా ఆ గేట్ వద్ద పెద్ద నెమళ్ల విగ్రహాలు ఏర్పాటుచేశారు. లాక్ డౌన్ తర్వాత విజిటర్లందరికీ ఇది సర్ ప్రైజ్. ఫతేగర్ బ్రిడ్జి మరమ్మతులు, హైటెక్ సిటీ రోడ్లు - అండర్ పాస్ లు ఇలా ఒకటేమిటి చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఐకియా వద్ద కూడలి కొత్త విగ్రహాలతో దర్శనమివ్వనుంది. నగరం మొత్తం మీ నడుం విరగ్గొట్టిన రోడ్లు... రైలు ప్రయాణంలా సాఫీగా సాగిపోయేలా తయారుకానున్నాయి. పురపాలక మంత్రి దగ్గరుండి మరీ వీటిని పర్యవేక్షిస్తున్నారు. పలు చోట్ల పనులను స్వయంగా పర్యవేక్షించారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కేసీఆర్ వారసత్వాన్ని నిలబెడుతున్న కేటీఆర్... జనాలతో మార్కులు కొట్టేస్తున్నారు. ఆపద సమయంలో అందరికీ అండగా ఉంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే పనిచేసినా... తెలంగాణలో ఆ ఓట్లకోసం చేసే పని కూడా క్వాలిటీతో చేయడం వల్ల ప్రజల ఆదరణ సంపాదించుకుంటున్నారు. మరో ఆరునెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఈ అభివృద్ధి పనులు ఇంత యుద్ధప్రాతిపదికన చేయడానికి అది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. దేశంలో ఇలా విభిన్నంగా కోవిడ్ లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకుంటున్నా రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పొచ్చు. మొత్తానికి లాక్ డౌన్ ప్రభుత్వానికి కష్టాలతో పాటు కొంచెం కంఫర్ట్ కూడా ఇచ్చిందన్నమాట.