Begin typing your search above and press return to search.

తేజస్వి కోసం 44 వేల పెళ్లి సంబంధాలొచ్చాయట

By:  Tupaki Desk   |   11 Nov 2020 3:10 PM GMT
తేజస్వి కోసం 44 వేల పెళ్లి సంబంధాలొచ్చాయట
X
తాజాగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ విజయపు అంచుల దాకా వెళ్లి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ప్రధాని మోడీ, బిహార్ సీఎం నితీశ్ లకు ఎదురొడ్డి ప్రచారం చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై మాత్రం ప్రశంసలు కురుస్తున్నాయి. హేమాహేమీలు ప్రచారం చేసినప్పటికీ....తేజస్వి యాదవ్ బెదరకుండా వన్ మ్యాన్ ఆర్మీలా ప్రచారం చేశాడంటూ పలువురు కితాబిస్తున్నారు. తేజస్వికి మంచి రాజకీయ భవిష్యత్ ఉందని అంటున్నారు. ఓ వైపు ఎన్నికల సందర్భంగా తేజస్వి యాదవ్ పోరాటపటిమపై ప్రశంసలు కురుస్తుంటే....మరోవైపు గతంలో తేజస్వికి చెందిన ఓ ఆసక్తికర విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది. గతంలో రోడ్లు, భవనాల శాఖా మంత్రిగా పనిచేసిన తేజస్వి యాదవ్ కు ఏకంగా 44 వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయన్న విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోడ్లు, భవనాల శాఖామంత్రిగా తేజస్వి పనిచేసిన సందర్భంగా శివమణి టైప్ లో తన మొబైల్ నంబర్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాడు తేజస్వి యాదవ్. బిహార్ లో ఎక్కడైనా రోడ్లు బాగోలేకుంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని తేజస్వి చెప్పారు. అయితే, ఆ నంబర్ కు రోడ్ల మీద ఫిర్యాదులకంటే తేజస్వికి పెళ్లి సంబంధాల కోసం ఎక్కువగా ఫోన్లు వచ్చాయట. రోడ్ల రిపేర్ల సంగతి పక్కనబెడితే....తనను పెళ్లి చేసుకోవాలంటూ చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు తేజస్వికి విన్నవించుకున్నారట. అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన తేజస్వి కోసం బిహార్ అమ్మాయిలు ఎగబడ్డారట. అన్నీ కలిసొస్తే ఈ సారి ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎం అయ్యే అవకాశాలు తేజస్వికి మెండుగా ఉన్నాయి. దాంతోపాటు, ముద్దుగా బొద్దుగా ఉన్న తేజస్విని చూసి చాలామంది అమ్మాయిలు మనసుపారేసుకున్నారట. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.