Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో తేజస్వీయాదవ్ డబ్బు పంపిణీ .. వీడియో వైరల్

By:  Tupaki Desk   |   11 Sept 2021 2:57 PM IST
ఎన్నికల్లో తేజస్వీయాదవ్ డబ్బు పంపిణీ .. వీడియో వైరల్
X
ఆర్జేడీ .. రాష్ట్రీయ జనతాదళ్, నాయకుడు తేజస్వీ యాదవ్ గ్రామస్థులకు డబ్బు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో, అతను చిక్కుల్లో పడ్డారు. బీహార్‌ లో పంచాయతీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గ్రామస్థులకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఉద్ధేశపూర్వకంగా తేజశ్వీ డబ్బు పంపిణీ చేశారని పేర్కొంటూ వీడియోను జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ అప్‌లోడ్ చేశారు.

ఈ ఘటనపై విచారణ జరపాలని జేడీయూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై గోపాల్‌ గంజ్ జిల్లా అధికారి బైకుంత్‌ పూర్ పోలీసులను, బీడీఓ ను విచారించాలని ఆదేశించారు. ఈ ఆరోపణలను ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తియాదవ్ ఖండించారు. లోక్ సభ ఎన్నికలు కాదని, గోపాల్ గంజ్ లో కోడ్ విధించలేదని, మహిళలు మందులు కొనడానికి ఆర్థిక సహాయం కోరగా తేజస్వీ అందించారని, ఇందులో రహస్యం ఏమీ లేదని శక్తి యాదవ్ వివరణ ఇచ్చారు.

గోపాల్‌ గంజ్‌ లో చిత్రీకరించిన 21 సెకన్ల వీడియోలో, ఆర్జేడీ నాయకుడు తన కారు దగ్గర నిలబడి ఉన్న ముగ్గురు మహిళలకు డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తేజస్వీ తన కారులో కూర్చునే మహిళలకు డబ్బు ఇస్తున్నట్లు వీడియోలో ఉంది. పేద గ్రామీణుల ఒడిలో డబ్బులు పడేస్తున్న యువరాజు ఎవరు, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ అంటూ నీరజ్ కుమార్ తన ట్వీట్‌ కి క్యాప్షన్ గా ఇచ్చారు. బైకుంత్‌ పూర్ బ్లాక్‌ లో మాజీ ఎమ్మెల్యే దేవ్ దత్ ప్రసాద్ 10 వ వార్షికోత్సవంలో తేజస్వీ యాదవ్ పాల్గొంటున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.