Begin typing your search above and press return to search.

డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ కి తాకిన కరోనా సెగ !

By:  Tupaki Desk   |   2 Nov 2020 3:00 PM IST
డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ కి తాకిన కరోనా సెగ !
X
కరోనా... కరోనా ... కరోనా ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు. అసలు ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం భయంతో వణికిపోతోంది. గత ఏడాది చివర్లో మొదలైన ఈ మహమ్మారి వ్యాప్తి రోజులు గడిచేకొద్ది పెరుగుతూనే ఉంది తప్ప , తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 48 మిలియన్ల మందికి పాజిటివ్ గా తేలింది. ఇకపోతే, ఈ మధ్య మళ్లీ కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కూడా మొదలైంది. దీనితో యూరోపియన్ దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు.

ఇకపోతే , ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రకంపనలు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేసెస్‌ ను తాకాయి. వైరస్ బారిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ‌లో ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, కరోనా వైరస్‌ కు సంబంధించిన లక్షణాలేవీ కనిపించలేదని తెలిపారు. అయినా కానీ డబ్ల్యూహెచ్ ‌ఓ మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని రోజుల పాటు తాను సెల్ఫ్ క్వారంటైన్ ‌లో ఉంటూ, ఇంటినుంచే కార్యకలాపాలను నిర్వహించనున్నానని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన మార్గదర్శకాలను మనమంతా విధిగా పాటించాలని, తద్వారా మాత్రమే కరోనా వ్యాప్తికి సంబంధించిన లింక్ ను ఛేదించగలుగుతామని టెడ్రోస్ అన్నారు.