Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన పెద్దాయన
By: Tupaki Desk | 7 Oct 2020 2:20 PM ISTమహమ్మారితో కిందా మీదా పడుతున్న ప్రపంచానికి మరో సమస్య ముంచుకొస్తున్న సంగతి తెలిసిందే. పలు యూరోపియన్ దేశాలతో పాటు.. అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ షురూ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. పలు దేశాల్లో భారీ ఎత్తున లాక్ డౌన్ లు విధిస్తున్నారు. దీంతో.. కరోనా పేరెత్తితే చాలు హడలిపోయే పరిస్థితి. భారత దేశానికి వస్తే.. రోజుకు తొంభై వేల కేసుల స్థానే.. ఇప్పుడు ఆ జోరు కాస్త 60వేలకు కేసులు తగ్గాయి.
దేశంలో మహారాష్ట్ర.. కర్ణాటక.. తమిళనాడు.. ఏపీ.. కేరళ లాంటి కొద్ది రాష్ట్రాల్లోనే కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇలాంటివేళ.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న ఆత్రుత అంతకంతకూ పెరిగిపోతోంది. చూస్తుండగానే అక్టోబరు వచ్చేసిన నేపథ్యంలో.. పరిశోధనలో ఉన్న వ్యాక్సిన్లపై తీపి కబురు ఇప్పటివరకు స్పష్టంగా వచ్చింది లేదు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా ఆశలు రేకెత్తిస్తున్నట్లుగా చెప్పారు. వ్యాక్సిన కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుందని చెప్పిన ఆయన.. టీకా అందుబాటులోకి వచ్చాక వాటి పంపిణీకి అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న మాటతో పాటు.. వ్యాక్సిన్ వచ్చినంతనే దేశాల మధ్య సహకారం అందించుకోవాలన్న వరకు విషయం వెళ్లిందంటే.. వ్యాక్సిన్ ప్రయోగాలు చివరకు వచ్చినట్లేనని చెప్పక తప్పదు. ప్రపంచం రిలాక్స్ అయ్యే మాటలు చెప్పిన టెడ్రోస్.. కోట్లాది మంది గుండెల మీద భారాన్ని కాస్త తగ్గించారని చెప్పక తప్పదు.