Begin typing your search above and press return to search.

ఐటీ కంపెనీలకి టెక్కీలు గుడ్ బై .. ఎందుకంటే

By:  Tupaki Desk   |   18 Oct 2021 10:30 AM IST
ఐటీ కంపెనీలకి టెక్కీలు గుడ్ బై .. ఎందుకంటే
X
సాఫ్టువేర్ సంస్థలు గత కొద్ది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా ఉద్యోగ వలసలను సమస్యను ఎదుర్కొంటున్నాయి. కరోనా అనంతరం అన్ని రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, ఐటీ ఉద్యోగుల వలసలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఓటీటీ, ఏఐ వంటి డిజిటల్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఈ రంగంలో డిమాండ్‌ ను పెంచింది. దీనితో ఈ నైపుణ్యాలు కలిగిన వారిని ఆకర్షించేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ప్రత్యేక ఉత్పత్తులు, సేవలపై దృష్టి కేంద్రీకరించిన స్టార్టప్ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీల్లో కోర్ నైపుణ్యం కలిగిన వారికి అధిక వేతనాలు అందిస్తున్నాయి. గత ఆరు నెలల్లో డిజిటల్ నైపుణ్యాలు కలిగిన వారికి డిమాండ్ పెరిగింది. మహమ్మారి అనంతరం డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరిగి, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి డిమాండ్‌ కు కారణంగా మారిందని చెబుతున్నారు. వివిధ రంగాల్లోని కంపెనీలు క్లౌడ్ సేవలపై ఖర్చు చేస్తున్నాయి. దీనితో డేటా సెంటర్స్ కోసం ఐటీ కంపెనీలు భారీగా క్లౌడ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన వారికి ఎక్కువ వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయని చెబుతున్నారు.

ఒక్కో సాఫ్టువేర్ కంపెనీలో సగటున గత ఏడాది నాటికి 8 నుండి 10 శాతం ఉన్న డిజిటల్ నిపుణులు, ఇప్పుడు 25 శాతానికి పెరిగారు. సాధారణంగా ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి వెళ్లే వలసల రేటు ఇదివరకు 11 శాతం నుండి 12 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది 20 శాతం దాటింది. ఇదివరకు ఉద్యోగి కంపెనీ మారినప్పుడు 30 శాతం వరకు అధిక వేతనం ఉండిది. ఇప్పుడు 50 శాతానికి పెరిగింది.

ఇక కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం.. ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమ వేగవంతం కావడం.. ఇంకోవైపు కరోనా పై ప్రజల్లో వచ్చిన అవగాహనతో చాలా సంస్థలు తిరిగి ఆఫీసులను తెరవడానికి రెడీ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌లో వర్క్‌ ఫ్రం హోంకి శుభం కార్డ్‌ పడనున్నదని తెలుస్తోంది. తాజాగా ఉద్యోగులు ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చింది. దేశ, విదేశాల్లో పనిచేస్తున్నమొత్తం 528,748 మంది టీసీఎస్‌ లో ఉద్యోగులు నవంబర్‌ 15లోపు ఆఫీస్ లో జాయిన్ అవ్వాలని ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిలింద్‌ లక్కడ్‌ చెప్పారు. ఇప్పటికే ఈ మేరకు ఉద్యోగస్తులకు మెయిల్స్ పంపించామని తెలిపారు.

తాము తమ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఇప్పటికే సంస్థలోని ఉన్నత ఉద్యోగులు సుమారు 5శాతం మంది ఆఫీసుకు హాజరవుతున్నారని చెప్పారు. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే ప్రకియ దశలవారీగా ఉందనున్నదని చెప్పారు. 2022 జనవరి కల్లా ఉద్యోగుల్ని ఆఫీస్‌లో పనిచేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే టీసీఎస్‌ ఉద్యోగులు ఆఫీస్‌లో వర్క్‌ చేసేందుకు మొగ్గుచూపుతున్నారంటూ పలు మార్లు టిసిఎస్ యాజమాన్యం ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే కరోనా థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ రాదని గ్యారంటీ ఏమీ లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికీ కొన్ని కంపెనీలు దైలమాలో ఉన్నాయి. ఎంప్లాయిస్‌‌‌‌కు పూర్తిస్థాయి భద్రత కల్పించగలమా అన్న అనుమానాలూ ఉన్నాయి. కరోనా విషయంలో ఉద్యోగస్తులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించగలమా అన్న డైలమాలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ విషయం గురించి డెలాయిట్‌‌‌‌ ఇండియా ట్యాలెంట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఎస్‌‌‌‌.వి.నాథన్‌‌‌‌ మాట్లాడుతూ ఎక్కువ మంది ఎంప్లాయిస్ హైబ్రిడ్‌‌‌‌ మోడల్‌‌‌‌ను ఇష్టపడుతున్నారని చెప్పారు. వసరమైనప్పుడు ఆఫీసుకు వస్తూ మిగతా రోజుల్లో వర్క్‌‌‌‌ ఫ్రం హోం చేయడాన్ని హైబ్రిడ్‌‌‌‌ మోడల్‌‌‌‌గా పిలుస్తున్నారు. వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న ఎంప్లాయిస్‌‌‌‌లను మాత్రమే ఆఫీసుకు రమ్మన్నామని, మిగతా వారికి అక్టోబరు 31 దాకా వర్క్‌‌‌‌ ఫ్రం హోం ఉంటుందని విప్రో తెలిపింది. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే ట్యాక్‌‌‌‌ సెక్యూరిటీ ఇండియా తన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు పనిచేస్తే చాలని ప్రకటించింది.