Begin typing your search above and press return to search.
దారుణం : అమీర్ పేటలో టెక్కీ దారుణ హత్య
By: Tupaki Desk | 12 Oct 2020 10:45 AM ISTహైదరాబాద్ లోని అమీర్ పేటలో దారుణం జరిగింది. ధరంకరం రోడ్డులో కేశన చంద్రశేఖర్ రాజు (25)ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. అతడి భార్య తరుఫు బంధువులే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కేశన చంద్రశేఖర్ రాజుతో మచిలీపట్నంకు చెందిన లక్ష్మీగౌరి(22)కు 2019 ఫిబ్రవరి 23న వివాహం జరిగింది. హైదరాబాద్ నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ రాజు.. తన భార్యతో కలిసి అల్విన్ కాలనీలో కాపురం ఉంటున్నాడు.
జూన్1న లక్ష్మీ గౌరి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అతడి తల్లిదండ్రులు వరకట్నం కోసం వేధించడం వల్లే లక్ష్మీ గౌరి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రశేఖర్ తోపాటు అతడి తల్లిదండ్రులు కృష్ణారావు, ఝాన్సీ లక్ష్మీపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో జైలుకు వెళ్లిన చంద్రశేఖర్ రాజు ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. ప్రతివారం బాలానగర్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి హాజరు కావాల్సి ఉండడంతో ధరంకరం రోడ్డులోని మేనమామ ఇంట్లో ఉంటున్నాడు.
ఆదివారం ఉదయం చికెన్ కోసం బయటకొచ్చిన చంద్రశేఖర్ రాజుపై నలుగురు దుండగులు దాడి చేశారు. సెల్లార్ లో కత్తులతో పొడిచి పరారయ్యాడు. తీవ్రరక్తస్రావంతో చంద్రశేఖర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా చంద్రశేఖర్ రాజు భార్య లక్ష్మీ గౌరి బంధువులే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాల కోసం దర్యాప్తు చేపట్టారు.