Begin typing your search above and press return to search.

అంచనాలకి మించి లాభాల బాట పట్టిన టెక్ మహీంద్రా.. ఉద్యోగులకి శుభవార్త..?

By:  Tupaki Desk   |   24 Oct 2020 4:40 PM IST
అంచనాలకి మించి లాభాల బాట పట్టిన టెక్ మహీంద్రా.. ఉద్యోగులకి శుభవార్త..?
X
భారత ప్రముఖ ఐటీ సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్లో అంచనాలకి మించి దూసుకుపోయింది. రెండో క్వార్టర్‌ లో లాభం రూ.1,064.6 కోట్లుగా నమోదు అయింది. మార్జీన్ పెరిగినప్పటికీ ఏడాది ప్రాతిపదికన మాత్రం లాభం 5.27 శాతం తగ్గింది. గత మూడు నెలల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.32 శాతం వృద్ధితో రూ.9,371 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ 42.1 డాలర్ల విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. షేర్ హోల్డర్స్ ‌కు ఒక్కో షేర్‌ కు రూ.15 ప్రత్యేక డివిడెండ్ చెల్లించనుంది.

సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపరేషన్స్ రెవెన్యూ 2.9 శాతం ఎగిసి, రూ.9,371.8 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.9,106.3 కోట్లుగా నమోదయింది. డాలర్ రెవెన్యూ క్వార్టర్ ప్రాతిపదికన 4.8 శాతం పెరిగి రూ.1,265.4 మిలియన్ డాలర్లకు చేరుకుంది. రెవెన్యూ వృద్ధి క్వార్టర్ ప్రాతిపదికన 2.9 శాతం పెరిగింది. ఈ త్రైమాసికానికి గాను ప్రతి షేర్ ‌కు రూ.15 డివిడెండ్‌ ను ప్రకటించింది.జూన్ క్వార్టర్ ‌లో రూ.972 కోట్లు కాగా, ఈసారి రూ.1,064 కోట్లకు పైగా నమోదు చేసింది. ఎబిట్ మార్జిన్ 410 పాయింట్లు పెరిగిందని టెక్ మహీంద్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీపీ గుర్నానీ చెప్పారు.

5జీ, క్లౌండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కంపెనీ ఫోకస్ చేస్తోందని, దీంతో వృద్ధి 4.8 శాతం పెరిగిందని తెలిపారు. కొత్తగా ఏడుగురు క్లయింట్స్ జత కావడంతో సంఖ్య 988కి చేరుకున్నట్లు టెక్ మహీంద్ర వెల్లడించింది. కొత్తగా 421 మిలియన్ డాలర్ల విలువైన ఆర్జర్స్ చేజిక్కించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం సంస్థలో 1,24,258 మంది ఉద్యోగులు ఉన్నారు. జూనియర్ స్థాయి సిబ్బంది వేతనాలను మార్చి క్వార్టర్‌ లో పెంచనున్నట్లు తెలిపింది. సీనియర్ స్థాయి ఉద్యోగాలను వచ్చే ఏడాది పెంచుతామని తెలిపింది.