Begin typing your search above and press return to search.
కన్నీళ్లు తెరిపిస్తున్న చిన్నారి విన్నపం..మా నాన్నను వదిలేయండి అంకుల్
By: Tupaki Desk | 6 April 2021 3:09 PM ISTఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకున్న భీకర కాల్పుల్లో అటు మావోలు.. ఇటు భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున మరణించటం తెలిసిందే. కూంబింగ్ చేసేందుకు వెళ్లిన కోబ్రా యూనిట్ కు చెందిన రాకేశ్వర్ సింగ్ మిన్హాస్ కనిపించకుండా పోయారు. ఆయన ఆచూకీ లభించలేదు. అయితే.. ఆయన్ను మావోలు అదుపులోకి తీసుకున్న విషయం బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ బీజాపూర్ కు చెందిన ఇద్దరు విలేకరులకు మావోలు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
దీంతో.. ఈ విషయం బయటకు వచ్చింది. విలేకరులకు వచ్చిన ఫోన్ల మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. తమ చెరలో రాకేశ్వర్ ఉన్నాడని.. అతడ్ని విడిచిపెట్టాలంటే..ఆపరేషన్ ప్రహార్ ను తక్షణమే నిలిపివేయాలని మావో నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక.. ప్రస్తుతం మావోల చేతిలో బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ ది జమ్ముకశ్మీర్ ప్రాంతానికి చెందిన వాడు. అతడ్ని మావోలు కిడ్నాప్ చేయటంపై వారి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
రాకేశ్వర్ కుమార్తె.. తన తండ్రిని విడిచి పెట్టాలంటూ అడుగుతున్న తీరు పలువురిని కదిలిస్తోంది. ‘అంకుల్.. మా నాన్న మీ దగ్గర ఉన్నారు. ఆయన్ను క్షేమంగా వదిలిపెట్టండి.. ఆయన్ను ఏమీ చేయొద్దు ప్లీజ్’ అంటూ అడిగిన తీరు పలువురికి కన్నీళ్లను తెప్పిస్తోంది. ఇదిలా ఉంటే.. మావోల చెరలో ఉన్న తన భర్తను క్షేమంగా తీసుకురావాలని రాకేశ్ సతీమణి ప్రధాని మోడీతో పాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరుతున్నారు. సైద్ధాంతిక విభేదాలున్న మావోలు.. తమ చెరలో ఉన్న అధికారికి ఎలాంటి హాని తలపెట్టకుండా.. వదిలేయటం మంచిదన్న అభిప్రాయం పలువురి నోట వ్యక్తమవుతోంది.