Begin typing your search above and press return to search.
యోగి రాజ్యం లో టీచర్ల కు అలాంటి పనులా?
By: Tupaki Desk | 29 Jan 2020 7:00 AM ISTసాధారణం గా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్ల పనేమిటి? పిల్లలకు చక్కగా చదువు చెప్పటం.. ప్రభుత్వ అవసరానికి తగ్గట్లు కొన్ని సర్వేలు.. జనాబా లెక్కలు.. ఎన్నికల వేళలో బాధ్యతలు నిర్వహించటం లాంటివి చేస్తుంటారు. అయితే.. మహిళా టీచర్లను మరోలా కూడా పని చేయొచ్చన్న అద్భుతమైన ఆలోచన చేసింది ఉత్తర ప్రదేశ్ సర్కారు. తన పాలనలో యూపీ ఎక్కడికో వెళ్లిపోతుందని చెప్పే యోగి మాష్టారు.. తాజాగా ఆ రాష్ట్ర అధికారులు జారీ చేసిన ఆదేశాలు సంచలనంగా మారాయి.
యూపీ సర్కారు నిర్వహించే సామూహిక వివాహాల కార్యక్రమంలో మహిళా టీచర్లకు వినూత్నమైన బాధ్యతను అప్పజెప్పారు. పెళ్లి కుమార్తెల్ని అందంగా ముస్తాబు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన అధికారి ఉత్తర్వును జారీ చేయటం వివాదాస్పదంగా మారింది. యూపీ లోని సిద్ధార్థ నగర్లో ఈ రోజు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన సామూహిక వివాహాలు జరిపించనున్నారు.
ఈ నేపథ్యంలో యూపీ విద్యా శాఖ తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. కొత్తగా పెళ్లి చేసుకోనున్న పెళ్లి కుమార్తెల్ని అందంగా ముస్తాబు చేయాలని పేర్కొంటూ ఇరవై మంది మహిళా టీచర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. వారిని అందంగా.. ఆకర్షణీయం గా తయారు చేయాలన్న బాధ్యతను అప్పగించింది. దీనిపై విద్యా శాఖ లో కలకలం రేగటమే కాదు.. ఈ సిత్రమైన ఆదేశాల కాపీ ఇప్పుడు వైరల్ అయ్యింది. దీంతో.. అధికారుల నిర్ణయాన్ని తిట్టి పోస్తున్నారు. అయినా.. టీచర్ల చేత పాఠాలు చెప్పించటం మానేసి.. ఈ మేకప్ పనులు అప్పగించటం ఏమిటి? పెద్ద ఎత్తున విమర్శలు రావటం తో.. ఈ ఆదేశాల్నిరద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినా.. మీ రాజ్యంలో ఇలాంటి పనులేంటి యోగి మహారాజ్?