Begin typing your search above and press return to search.

13 ఏళ్ల కుర్రాడితో ఆ టీచర్ చేసిన పని..

By:  Tupaki Desk   |   16 Jan 2017 9:21 AM GMT
13 ఏళ్ల కుర్రాడితో ఆ టీచర్ చేసిన పని..
X
ఇది రీల్ కథ ఎంతమాత్రం కాదు.రియల్ గా జరిగిందే. ఫోటోలో కనిపిస్తున్న ఈ చక్కనమ్మ ఒక టీచర్. కానీ.. ఆమె చేసిన పని ఇప్పుడెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మోడ్రర్న్ సొసైటీ.. ఫ్రీ లైఫ్ అన్న అమెరికా లాంటి దేశంలోని చట్టాలు సైతం కన్నెర్ర చేయటమే కాదు పదేళ్లు జైలుశిక్ష విధించాయి. మామూలుగా అయితే.. ఆమె చేసిన నేరానికి 10ఏళ్లు జైలుశిక్ష వేయాలని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తానేం తప్పు చేశానన్నట్లుగా ఆ టీచరమ్మ వాదిస్తోంది.

ఈ మొత్తం స్టోరీని చదివితే దిమ్మ తిరిగిపోవటమే కాదు.. భారీ షాక్ తప్పదు. ఇంతకీ అసలేం జరిగిందన్నది చూస్తే.. టెక్సాస్ లోని హ్యూస్టన్ ప్రాంతానికి చెందిన అలెగ్జాండ్రియా వీరా అనే పాతికేళ్ల టీచర్ ఉంది. ఆమెకు ఆరేళ్ల కూతురు ఉంది. ఏమైందో ఏమో కానీ.. ఇన్ స్టాగ్రాం ద్వారా ఆమెకు పదమూడేళ్ల కుర్రాడితో పరిచయం అయ్యింది. మొదట్లో స్నేహంగా మొదలైన ఈ వ్యవహారం తర్వాత ప్రేమగా మారిందట. దీంతో.. ఆమె గర్భవతి అయ్యింది. అబార్షన్ కూడా చేయించుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తను మనసు పడిన ఆ పదమూడేళ్ల కుర్రాడితో సన్నిహితంగా ఉండే ఈ టీచర్.. వారి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు మొయింటైన్ చేసేది.

వారి కుటుంబానికి కొన్ని ఆర్థిక అవసరాలు తీర్చేది. ఆర్థికంగా సాయం చేసేది. వీరి మధ్య రిలేషన్ అబ్బాయి ఇంట్లో తెలుసో లేదో కానీ.. వీరా కుమార్తె మాత్రం ఈ పిల్లాడ్ని ‘డాడ్’ అని పిలిచేదట. ఇలా తొమ్మిది నెలల పాటు సాగిన వీరి రిలేషన్ స్కూల్ ద్వారా అధికారులకు తెలిసింది. వెంటనే రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. వీరాను అరెస్ట్ చేశారు. పిల్లల్ని లైంగికంగా వేధించిందన్న నేరాన్ని మోపారు. ఆమె చేసిన పని ఏ మాత్రం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. వీరాను జైలుకు పంపటం ద్వారా సమాజానికి గట్టి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా ఈ కేసును విచారించిన కోర్టు పేర్కొంది. ఆమెకు పదేళ్లు జైలుశిక్ష విధించింది కోర్టు. టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పాలేకానీ.. ఇలాంటివి చోటు చేసుకోకూడదని న్యాయమూర్తులు పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉంటే.. జైలుశిక్ష పడిన టీచరమ్మ ఐదేళ్ల తర్వాత పెరోల్ మీద విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికాలో ఆమె ఉన్నప్రాంతంలో ఈ ఉదంతం సంచలనంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/