Begin typing your search above and press return to search.

మూడు పార్టీలు కలిసి ఏపీ అభివృద్ధిని సర్వనాశనం చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   31 Jan 2020 9:00 PM IST
మూడు పార్టీలు కలిసి ఏపీ అభివృద్ధిని సర్వనాశనం చేస్తున్నారా?
X
ఏపీకి మూడు రాజధానులు వస్తాయో రావో తెలియదు కానీ ,మూడు రాజధానుల పేరు చెప్పి రాజకీయనాయకులు లాభం మాత్రం పొందుతున్నారు. కొందరు మూడు రాజధానులకి సమ్మతం అని , మరికొందరు జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కానీ  -ఈ ప్రజాప్రతినిధులతో ఒకరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. ఎంతసేపూ మూడు రాజధానులు వద్దు అని టీడీపీ ...మూడు రాజధానులు ముద్దు అని వైసీపీ నేతలు అంటున్నారే తప్ప ..రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి అన్న భాధ ఒక్కరికి లేదు.

ముఖ్యంగా ఏపీకి జీవనాడి అయిన పోలవరం గురించి పట్టించుకునేనాధుడే కరువైయ్యాడు. పోలవరం ప్రాజెక్టు గోదావరి - కృష్ణా నదులను అనుసంధానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా - పోలవరం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళార్థ సాధక నీటిపారుదల పథకం. విశాఖపట్నం - ఉభయ గోదావరి - కృష్ణా జిల్లాలలోని మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాజెక్ట్ ని 2004 లో ప్రారంభించినప్పటికీ కూడా ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి తప్ప పూర్తీ కాలేదు. మొదట్లో పనులు ప్రారంభం అయిన తరువాత మధ్యలో ఏవో కారణాలతో ప్రాజెక్ట్ నిర్మాణం ఆగిపోగా ..ఆ తరువాత మళ్లీ రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. కానీ , ఆ సమయంలో కేంద్రంతో పని కాదు అని భావించి అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ..రాష్ట్ర బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలని నిర్ణయం తీసుకోని ఆ విధంగానే ముందుకుపోయారు.

కానీ , ఆ తరువాత 2019 లో జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన అయిన ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెడుతుంది అని అంతా భావించారు. కానీ , వైసీపీ అధికారంలోకి రాగానే బాబు ప్రభుత్వంలో అన్నింట్లో కూడా అవినీతే ప్రథమస్థానంలో నిలిచింది అంటూ ,,,ప్రధాన ప్రాజెక్ట్స్ పై రెవెర్స్ టెండరింగ్ కి పోవడంతో పోలవరం పనులు పూర్తిగా అటకెక్కిపోయాయి. ఆ మధ్య మళ్లీ పనులు ప్రారంభించబోతున్నారు అని చెప్పినప్పటికీ ..ఒక్కరోజులోనే మళ్లీ కథ మొదటికి వచ్చింది. ప్రస్తుతం ఈ రెవెర్స్ టెండరింగ్ పై కోర్టులో స్టే ఉంది. ఇక డే విదంగా కేంద్రం తగిన బడ్జెట్ ఇవ్వకపోయినప్పటికీ ...చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఖజానా లో నుండి డబ్బుని తీసి ఈ ప్రాజెక్ట్ కి పెట్టి ..రాష్ట్ర బడ్జెట్ కింద కేంద్రానికి బిల్లు పెట్టగా  మోడీ ప్రభుత్వం ...ప్రాజెక్ట్ కి న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బుని ఇవ్వకుండా ...మీరు చూపించే లెక్కలు సరిగా లేవు అంటూ పోలవరం నిధుల్ని విడుదల చేయకుండా మోసం చేస్తుంది. మొత్తంగా వైసీపీ ప్రభుత్వమే పోలవరం ఆపేసింది అని టీడీపీ ...టీడీపీ చేసిన అవినీతి వల్లే పోలవరం ఆగింది అంటూ వైసీపీ విమర్శలు చేస్తుంది..ఈ విధంగా మూడు పార్టీలు కూడా ఏపీ అభివృద్ధితో  ఆడుకుంటున్నాయి అని  రాజకీయ మేధావులు అంటున్నారు.