Begin typing your search above and press return to search.
పోరు మరింత తీవ్రతరం
By: Tupaki Desk | 8 April 2022 11:00 PM ISTవైసీపీ పై టీడీపీ పోరు మరింత తీవ్రతరం అయింది. ఇప్పటికే బాదుడే బాదుడు అంటూ పెంచిన ధరలపై టీడీపీ వీధి పోరాటం చేస్తుంది. ఇక మంత్రి జయరాం (నిన్నటి దాకా కార్మిక శాఖ మంత్రి, ఇంటి పేరు గుమ్మనూరు) పై కూడా న్యాయ పోరాటానికి సిద్ధం కానుందని తెలుస్తోంది.
ఆయన చేసిన అక్రమాలకూ, అవినీతికీ అంతూపొంతూ లేదని చెబుతూ.. తాజాగా ఒక పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇప్పుడీ పోస్టర్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం మంత్రి అనేక పద్ధతుల్లో దారి తప్పి కట్టు తప్పి నీతి తప్పి డబ్బులు దోచుకున్నారన్నది టీడీపీ చేస్తున్న ప్రధాన అభియోగం మరియు ఆరోపణ కూడా !
దీనిపైనే విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు కూడా సిద్ధం అవుతోంది. తాము అధికారంలో ఉండగా మంత్రి అచ్చెన్న నేతృత్వంలో ఈఎస్ఐ స్కాం జరిగిందని, కార్మికులకు వైద్యారోగ్య సాయం అందించే ఆస్పత్రులకు సంబంధించి మందుల కొనుగోళ్లలో అప్పటి మంత్రి అచ్చెన్న తనకు చెందిన కంపెనీలకూ, తనవారికి చెందిన కంపెనీలకూ ఎంతో మేలు చేశారని ఆరోపిస్తూ కేసు ఒకటి ఫైల్ అయింది.
ఇదే సమయంలో ఎంపీ రామూ (అచ్చెన్న అన్న కుమారుడు) తనదైన వాదన వినిపించడంతో పాటు బెయిల్ కోసం ఎంతో ప్రయత్నించారు.ఆఖరికి ఆయనను విడుదల చేశారు.
ఆ రోజు అచ్చెన్న జైల్లో ఉంటుండగానే టీడీపీ ఈడీ కి ఓ లేఖ రాశారని,జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆ లేఖ అయి ఉంటుందని ప్రఖ్యాత ఇంగ్లీషు దిన పత్రిక వెల్లడించింది. ఎందుకంటే అప్పట్లో ఈడీ కి సంబంధించి అధికారులు జగన్ కేసు విచారణను నెమ్మది చేశారు.
దీనిని వేగవంతం చేయాలని కోరుతూ టీడీపీ ఓ లేఖ రాసిందని టాక్. లేఖలో విషయాలు ఏమయినప్పటికీ ఆ రోజు అచ్చెన్నకు బెయిల్ రావడంతో పాటుఆయనపై ఆ రోజు చేసిన ఆరోపణలను ఇవాళ్టికీ వైసీపీ నిరూపణ చేయలేకపోయింది. ఇక తాజాగా గుమ్మనూరు జయరాం పై వస్తున్న ఆరోపణలపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో అన్నదే చూడాలిక. అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగన్ ఆయనను వచ్చే క్యాబినెట్ లోకి తీసుకుంటారా లేదా పక్కన బెడతారా అన్నది ఓ సంశయాత్మకంగా ఉంది.
మొత్తంగా ఆయన చేసిన అవినీతి విలువ ఏడు వందల 35 కోట్ల రూపాయలుగా తేల్చింది. ఇందుకు సంబంధించి వివరాలను గణాంకాలతో సహా సవివరంగా ఆ పోస్టర్ లో ప్రస్తావించింది. కనుక జగన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారో లేదా దీన్నొక పొలిటికల్ డ్రామాగా కొట్టి పారేస్తారో అన్నది వేచి చూడాలిక !