Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెరైటీ ఎంట్రీ

By:  Tupaki Desk   |   30 Nov 2020 2:40 PM IST
ఏపీ అసెంబ్లీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెరైటీ ఎంట్రీ
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైంది. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రజాప్రతినిధులకు సంతాప తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఈసారి అసెంబ్లీకి టీడీపీ ప్రజాప్రతినిధులు వెరైటీగా ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ధర్నా చేపట్టింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. తడిచిన వరి కంకులతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. 20 అంశాలపై వెరైటీ ఎంట్రీ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది.

ఉపాధి హామీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, ఇసుక పాలసీ, ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు.

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం చేసింది. టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు వాయిదా తీర్మానం చేశారు. తుఫాను సందర్భంగా రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ తీర్మానంలో టీడీపీ పేర్కొంది.