Begin typing your search above and press return to search.
వల్లభనేని ఈ నెలలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా?
By: Tupaki Desk | 10 July 2020 6:00 PM ISTటీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా దాన్ని తట్టుకొని నిలబడి టీడీపీ తరుఫున గన్నవరం నుంచి వంశీ గెలిచాడు. కానీ తదనంతర పరిణామాలతో టీడీపీలో ఉండలేకపోయారు.
టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుగా రాజకీయం చేశారనే అపవాదు ఉంది. దీంతో టీడీపీ నేతలు.. సోషల్ మీడియాలో వల్లభనేని వంశీ రెండు నాల్కల ధోరణిపై విమర్శలు గుప్పించారు. వంశీ తిరగబడి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం శాసనసభలో టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతు ప్రకటించిన వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ టీడీపీ వాసనలు వదలుకోవాలని డిసైడ్ అవుతున్నాడట? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరుఫున గన్నవరంలో పోటీచేసి గెలిచి ఆ అపవాదును తుడుచుకోవాలని ఆలోచిస్తున్నాడట.. ఈ క్రమంలోనే సీఎం జగన్ ను ఒప్పించాలని చూస్తున్నాడట..
టీడీపీ నేతల విమర్శల దృష్ట్యా.. ఉప ఎన్నికల్లో గెలిచి సగర్వంగా వైసీపీ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగుపెట్టాలని వంశీ ఆలోచిస్తున్నాడట.. ఇటు టీడీపీ కేడర్, అటు వైసీపీ కేడర్ తో ఈజీగా గెలుస్తాననే ధీమా వంశీలో ఉందట..
అయితే వంశీపై ఇటు టీడీపీ, అటు వైసీపీలోనూ వ్యతిరేకత గల వ్యక్తులున్నారు. ఇది వంశీకి ఎన్నికల్లో పెద్ద దెబ్బేనని అంటున్నారు. వంశీపై టీడీపీ కూడా నజర్ పెట్టింది. అటు వైసీపీ సిట్టింగ్ ఇన్ చార్జి కూడా వ్యతిరేకంగానే ఉన్నట్టు సమాచారం. హ్యాండిచ్చిన వంశీ గెలుపు నియోజకవర్గంలో నల్లేరుపై నడక కాదని పొలిటికల్ వర్గాలంటున్నాయి. అయితే వంశీ మాత్రం తనతోపాటు మద్దాల గిరి, కరణం బలరాంలు ముగ్గురూ రాజీనామా చేసి వైసీపీ తరుఫున నిలబడి గెలవాలని స్కెచ్ వేశారట.. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే టీడీపీని షేక్ చేయడానికి రెడీ అయ్యారట.. కానీ వీరి గెలుపుపై మీమాంసతోనే వైసీపీ అధిష్టానం తొందరపడడం లేదని తెలుస్తోంది..