Begin typing your search above and press return to search.

అచ్చెన్న ఇలాకాలో న‌యా వివాదం

By:  Tupaki Desk   |   1 Jun 2022 11:31 AM GMT
అచ్చెన్న ఇలాకాలో న‌యా వివాదం
X
టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం, నందిగాం మండ‌లం, స‌వ‌ర నీలాపురంలో గ్రానైట్ త‌వ్వ‌కాల‌కు అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్ద‌ని గిరిజ‌నులు ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం కు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు అచ్చెన్నాయుడు సార‌థ్యం వ‌హిస్తున్నారు.

తాజా పరిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు టీడీపీ ఏం అంటుందో చూడాలిక. ఇప్ప‌టిదాకా ప్లెబిసైట్ మాత్రమే నిర్వ‌హించి ఊరుకున్నారు వైసీపీ వ‌ర్గీయులు.

కానీ ఇప్పుడు ప్లెబిసైట్లో భిన్న వాద‌న‌లు రావ‌డంతో జేసీ ఏం చెబుతారో అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే నిన్న‌టి వేళ ప్లెబిసైట్ లో నిర‌స‌న‌లే వెల్లువెత్తాయి. త‌మ‌కు ఈ కొండే ఆధారంగా ఉంద‌ని., త‌మ బ‌తుకు దెరువు కొట్ట‌వ‌ద్ద‌ని గిరిజ‌నులు గ‌గ్గోలు పెడుతున్నారు.

మ‌రి ! వీరి గోడును విజువ‌ల్ రికార్డు చేసిన అధికారులు, న్యాయం చేస్తారా వీరికి ? గ‌తంలో ఇక్క‌డ గ్రానైట్ త‌వ్వ‌కాల‌కు ఓ ప్ర‌యివేటు వ్యాపారి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడ‌ని, అయితే దీనిపైనే ప్ర‌జాభిప్రాయం సేక‌రిస్తున్నామ‌ని జేసీ అంటున్నారు. ఇదే వార్త ప్ర‌ధాన మీడియాలో హైలెట్ అవుతోంది.

వాస్త‌వానికి ఇవాళ అటు ధ‌ర్మాన కృష్ణ‌దాసు నియోజ‌క‌వ‌ర్గం ( న‌ర‌స‌న్న‌పేట‌)లో కానీ, అచ్చెన్నాయుడు నియోజ‌క‌వ‌ర్గం (టెక్క‌లి)లో కానీ గ్రానైట్ త‌వ్వ‌కాలకు సంబంధించి వివాదాలు రేగుతున్నారు ఇరు పార్టీ స్పందిస్తున్న దాఖ‌లాలేవీ లేవ‌ని ప్ర‌జా సంఘాలు మండిప‌డుతున్నాయి.

ఇప్ప‌టికైనా స్పందించి న్యాయం చేయాల‌ని కోరుతున్నాయి. వాస్త‌వానికి గ‌తంలో వైఎస్ హ‌యాంలో ఇక్క‌డ రేగిన క‌న్నెధార కొండ లీజు వ్య‌వ‌హారంలో అప్పుడు ఎన్నో వివాదాలు న‌మోదు అయ్యాయి అని, వాటిని దాటుకుని తాము కొండ‌ను ర‌క్షించుకున్నామ‌ని అదేవిధంగా సవ‌ర‌నీలాపురంలో కొండ‌ను కూడా గ్రానైట్ త‌వ్వ‌కాల‌కు అనుమ‌తించే ప్ర‌స‌క్తే లేద‌ని, ఒక‌వేళ అనుమ‌తులు ఇస్తే ఇక్క‌డి డీ ప‌ట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజ‌నులు రోడ్డున ప‌డ‌తార‌ని ప్ర‌జా సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.