Begin typing your search above and press return to search.

టీడీపీ సోష‌ల్ మీడియా..మ‌రీ ఇంత సిల్లీగానా!

By:  Tupaki Desk   |   30 Jan 2020 8:00 AM IST
టీడీపీ సోష‌ల్ మీడియా..మ‌రీ ఇంత సిల్లీగానా!
X
ఈ మ‌ధ్య‌నే ఈవీఎంల హ్యాకింగ్ గురించి కీల‌క ఆధారాలు ల‌భించాయంటూ తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా సైనికులు పోస్టులు పెట్టారు. దేశం దాటిన ఒక ఉద్యోగి ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడ‌ని, ఈ విష‌యంపై కాంగ్రెస్ పార్టీ పోరాడబోతూ ఉంద‌ని, దీనిపై క‌పిల్ సిబాల్, రాహుల్ గాంధీలు చ‌ర్చించేశార‌ని.. అంటూ మొద‌లుపెట్టి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల హ్యాకింగ్ ద్వారానే గెలిచిందంటూ గోల చేసే ప్ర‌య‌త్నం చేశారు తెలుగు త‌మ్ముళ్లు. అయితే అదంతా ఒట్టి ప్ర‌హ‌స‌నంగా మిగిలిపోయింది. ఓడిపోవ‌డాన్ని తెలుగు త‌మ్ముళ్లు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేకే ఇలాంటి మాట‌లు మాట్లాడుతున్నార‌ని స్ప‌ష్టం అయ్యింది.

అదే అనుకుంటే.. తెలుగు త‌మ్ముళ్లు మ‌రో ప్ర‌చారాన్ని బీభ‌త్సంగా చేస్తున్నారు. అదేమింటే.. అమ‌రావ‌తిని దేశ రాజ‌ధానిగా చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తూ ఉంద‌ట‌. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. ఈ విష‌యం గురించి ఢిల్లీలో సీరియ‌స్ గా డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ట‌! ప్ర‌చారం చేయ‌డానికి చేతిలో సోష‌ల్ మీడియా ఉంద‌ని చెప్పి.. ఏది బ‌డితే అది ప్ర‌చారం చేయ‌డ‌మేనా!

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసుకోవ‌డానికి సోష‌ల్ మీడియా ను ఉప‌యోగించుకుంటే త‌ప్పేం లేదు. అయితే చేసే ప్ర‌చారం ఏదైనా కాస్తంతా న‌మ్మ‌ద‌గిన‌ట్టుగా ఉండాలి. ఊరికే ఉత్తుత్తి ప్ర‌చారాలు చేసుకుంటే ఏమోస్తుందో వారికే తెలియాలి.

అమ‌రావ‌తి పై తెలుగుదేశం పార్టీకి అపార‌మైన ప్రేమ ఉండ‌వ‌చ్చు గాక‌.. ఆ ప్రేమ‌ను స‌మ‌ర్థించుకోవ‌డానికి ఇలాంటి కామెడీ ప్ర‌చారాలు చేయ‌డం, ఆ కామెడీ ప్ర‌చారాల‌ను నిజం అని న‌మ్మించ‌డానికి.. ఆర్ఎస్ఎస్ నూ వాడేయ‌డం..ప్ర‌తిదానికీ కేంద్రం సీరియ‌స్ గా ఆలోచించేస్తూ ఉంద‌ని అన‌డం.. ప్ర‌తీదీ జ‌గ‌న్ కు షాక్ అని అన‌డం.. తెలుగుదేశం పార్టీకి ఏం లాభం చేకూర్చే అంశాలు కాద‌ని తెలుగుదేశం సోష‌ల్ మీడియా ఇప్ప‌టికీ గ్ర‌హించ‌లేక‌పోతూ ఉంది. గ‌త ఐదేళ్లుగా.. ప్ర‌తిదీ జ‌గ‌న్ కు షాక్, జ‌గ‌న్ కు షాక్ అంటూ వ‌చ్చారు. ఎన్నిక‌ల నాటికి ఎవ‌రికి షాక్ త‌గిలిందో అర్థం అయ్యింది. కాబ‌ట్టి తెలుగుదేశం సోష‌ల్ మీడియా విభాగాలు, వెబ్ విభాగాలూ..మ‌రీ సిల్లీగా, మ‌రీ మ‌రీ సిల్లీగా వ్య‌వ‌హ‌రిస్తే న‌వ్వుల‌పాలు కావ‌డం, త‌మ వాళ్ల‌ను తామే త‌ప్పుదారి ప‌ట్టించ‌డం త‌ప్ప మ‌రో ప్ర‌యోజ‌నం ఉండదేమో!