Begin typing your search above and press return to search.
టీడీపీ నెల్లూరు పెద్దారెడ్డీస్ పరార్
By: Tupaki Desk | 27 March 2021 5:00 PM ISTఏపీలో ఎన్నికలేవైనా వైసీపీ దూసుకెళ్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ విషయం అర్థమైంది. ఇప్పట్లో అధికార వైసీపీని ఢీకొట్టే ప్రతిపక్ష పార్టీ లేనట్లేనన్న చర్చ సాగుతోంది. ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు ఎన్నికలంటే భయపడుతున్నారు. ఎంత కష్టపడి చెమటోడ్చినా ఏదోరకంగా వైసీపీ సీట్లను తన్నుకుపోతుంది. టీడీపీ నాయకులు ఉన్న పార్టీలో ఇమడలేక.. వేరే పార్టీలో చేరలేక తలలు పట్టుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఒకప్పుడు టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నెల్లూరు పెద్దారెడ్డీలు ఇప్పుడు కనిపించడం లేదంట..వారు ఎటు వెళ్లినట్లు.. టీడీపీ లో ఉన్నారా..? లేరా..? అన్న చర్చ సాగుతోంది.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్డి బ్యాచ్ మంచి లాభం పొందారు. వారు టీడీపీలో కొనసాగినట్లు కటింగ్ ఇచ్చి కాంట్రాక్టులు తెచ్చుకొని పెద్ద ఎత్తున లాభ పడ్డారు. నెల్లూరు జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో వారు వందల కోట్ల బిజినెస్ చేసి బాగా సంపాదించారు. అయితే పార్టీకి ఎప్పుడైనా ఫైనాన్సియల్ గా వారు ఉపయోగపడుతారనే ఉద్దేశంతో టీడీపీ వారికి ఆ అవకాశం ఇచ్చింది. వారు ఎలాంటి అక్రమాలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు.
ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతింది. ఇక తిరుపతి బై ఎలక్షన్లోనైనా కనీసం గట్టి పోటీనివ్వాలని పార్టీ అధినేత ఆదేశాలు జారీ చేశారు. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్డీలు సరైన సమయానికి పరారయ్యారన్న చర్చ సాగుతోంది.
ప్రస్తుతం టీడీపీ పార్టీ పరంగానే కాకుండా ఫైనాన్సియల్ గా చాలా వీక్ గా ఉంది. ఈ సమయంలో అప్పుడు లాభం పొందిన వారు ఇప్పుడు తమపై పడుతారనే ఉద్దేశంతో ముందే పెట్టాబేడా సర్దుకొని ఇతర ప్రాంతాల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ మరోసారి పరువుపోవడం ఖామయా..? అన్న చర్చ సాగుతోంది.