Begin typing your search above and press return to search.
చంద్రబాబును చూసి ఓట్లేసే పరిస్థితి లేదంట
By: Tupaki Desk | 29 March 2021 4:00 PM ISTఏపీలో సైకిల్ పార్టీ సచ్చుబడిపోతోంది. నిన్నటి వరకు పసుపు జెండాను మోసిన నాయకులు మరోసారి వలసబాట పడుతున్నారు. పార్టీ విధానాలు నచ్చని కొందరు రాజీనామా చేసి గుడ్ బై చెబుతున్నారు. అధికారంలో లేకపోయామని తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆ కొద్దీ ఆదరణ కూడా కరువవుతోంది. ఏన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో రెపరెపలాడిన టీడీపీ జెండాను మోసేవారు రాను రాను కరువవుతున్నారు. మొన్నటి వరకు ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు టీడీపీలోనూ అదే తయారైంది. అయితే అందుకు కారణం ఎవరు..? ఎందుకు పార్టీనీ వీడుతున్నట్లు..? అసలేమైంది..?
అధికారం కోల్పోయినా కూడా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో టీడీపికి కాస్త పట్టుంది. అందుకే టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడికి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చాడు చంద్రబాబు. అ పదవికి అచ్చెన్నాయుడు పార్టీకి సరైన న్యాయమే చేస్తున్నాడు కావచ్చు.. కానీ సొంత జిల్లాలోని ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల టీడీపీకి చెందిన సీనియర్ నేత కూనం రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్ రావు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆముదాల వలస నియోజకవర్గంలోని ఆయన ఏ పార్టీలో చేరుతాడోనన్న విషయం తరువాత చెబుతానన్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబును చూసి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు. రిగ్గింగ్ కారణంగానే అచ్చెన్నాయుడు గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు.
అసలే మూలిగే నక్కమీద తాటి పండు పడ్టట్లు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న టీడీపీకి ఇలాంటి రాజీనామాలు తలనొప్పిగా మారాయి. ఇలా మరి కొన్ని చోట్ల కూడా చంద్రబాబు కారణంగా పార్టీని వీడనున్నారన్న చర్చ జరుగుతోంది. బాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అప్పట్లో పార్టీ నాయకత్వం మారాలని, ఎన్టీఆర్ ను బరిలోకి దించాలని కొందరు నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు షాక్ తిన్నాడు. అయితే ఇప్పటికిప్పుడు ఆయన పార్టీని వీడేట్లు కనిపించడం లేదు. అలాగనీ.. పార్టీ ఇలా ప్రమాదంలో పడితే చూస్తూ కూర్చోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది.
రాజీనామాల పరంపర కొనసాగితే ఇక త్వరలో జరిగే తిరుపతి బై ఎలక్షన్ పై ఈ ప్రభావం ఉంటుందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధినేత ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మరింత దిగజారే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడు పార్టీ పరంగా న్యాయం చేస్తున్నా.. క్యాడర్ ను కాపాడుకుంటే బెటరని కొందరు సూచిస్తున్నారు. అయితే కిల్లి రామ్మోహన్ రావు విషయంలో ఆయన ఏ విధంగా స్పందించడం లేదు. దీంతో ఇకనైనా రాజీనామాలు ఆగుతాయా..? లేదా..? చూడాలి.