Begin typing your search above and press return to search.
తమ్ముళ్ల కాళ్ల కింద బాబు కరపత్రం
By: Tupaki Desk | 22 Sept 2017 2:48 PM ISTగౌరవం మాటల్లో తప్పించి మనసులో లేకపోతే ఎలా ఉంటుంది? కమిట్ మెంట్ షో పీస్ గా మాత్రమే ఫీలయ్యే తెలుగు తమ్ముళ్ల తీరు ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోకి లాగుతుందన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఏపీ అధికారపక్షం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్టార్ట్ చేసిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా.. తమ ప్రభుత్వ హయాంలో వచ్చిన మార్పుల చిట్టాను భారీ కరపత్రాన్నే ప్రచురించారు.
వాటిని తీసుకొని ఇళ్లకు వెళుతున్న ఎమ్మెల్యేలు కరపత్రాల మీద తమకున్న కమిట్ మెంట్ ను చేతల్లో చేసి చూపిస్తున్నారు. కనిపించిన వారికి కనిపించినట్లు పంచే కరపత్రాలు.. రోడ్ల మీద పడుతున్నా పట్టించుకోవటం లేదు. చేతిలో ఉన్న వాటికే తప్పించి.. చేజారి కిందపడిన కరపత్రాల మీదనే నిలబడి మాట్లాడుతున్న ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం పంచుతున్న కరపత్రాలు కింద పడిపోయి ఉన్నా వాటిని పట్టించుకోని వైనంపై సోషల్ మీడియాలో పలువురు తప్పు పడుతున్నారు. డాబు ప్రచారాలు చేస్తే ఇలాంటివే జరుగుతాయని.. బయటోళ్ల సంగతి తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేనే కరపత్రాన్ని లైట్ గా తీసుకోవటం ఏమిటంటూ పలువురు తప్పు పడుతున్నారు.