Begin typing your search above and press return to search.
ఢిల్లీలో పార్టీ గదుల కోసం ఈ రచ్చేంది బాబు?
By: Tupaki Desk | 6 Feb 2020 11:04 AM ISTనీతులు చెప్పటమే కానీ ఆచరించటం చంద్రబాబుకు అస్సలు అలవాటు ఉండదన్న మాటకు తగ్గట్లే ఆయన వ్యవహారశైలి ఉంటుందని చెప్పక తప్పదు. తాజాగా ఢిల్లీలోని పార్లమెంటులో పార్టీ గదుల కోసం ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చిరాకు కలిగించేలా మారటమే కాదు.. ఈ అనవసర లొల్లి అవసరమా? అన్న భావన కలుగక మానదు. ప్రజలు రిజెక్టు చేసిన తర్వాత.. వారి తీర్పును అంగీకరించి.. ముడుచుకొని కూర్చోవాల్సిన వేళలోనూ.. పేచీలు పెట్టుకునే తీరు చూస్తే ఆశ్చర్యానికి గురి చేయక మానదు.
ఎన్నికల్లో పార్టీకి వచ్చే సీట్లకు తగ్గట్లు గదులు కేటాయించటం మామూలే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో లోక్ సభలో టీడీపీ ఎంపీల సంఖ్య భారీగా తగ్గి పోయింది. దీనికి తోడు రాజ్యసభ లోనూ అలాంటి పరిస్థితే. అధికారం చేతిలో ఉన్నప్పుడు నిత్యం బాబు వెంట ఉండే సుజనా చౌదరి.. సీఎం రమేశ్.. టీజీ వెంకటేశ్ లాంటి రాజ్యసభ సభ్యులు సైతం జెండా ఎత్తేసి.. భారతీయ జనతా పార్టీ జెండాను పట్టుకు తిరగటం తెలిసిందే.
ఇలాంటి పరిణామాలతో పార్లమెంటులో టీడీపీ సభ్యుల సంఖ్య అనూహ్యంగా ఐదుకు పడి పోయింది. ఇలాంటి వేళ.. పార్లమెంటు భవనం లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఐదో నెంబరు గదిలో టీడీపీ కార్యాలయం ఉంది. సభ్యుల సంఖ్య భారీగా పడిపోవటంతో.. అధికార పక్షంగా ఆ గదిని తమకు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి లోక్ సభ స్పీకర్ ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
దీనిపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకెంతో కాలంగా ఉంటున్న గదిని వైఎస్సార్ కాంగ్రెస్ కుఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి ఉండే ఎంపీల సంఖ్యకు అనుగుణంగా పార్టీ గదిని కేటాయిస్తారే కానీ.. మరే ఇతర అంశాలు కావన్న చిన్న విషయాన్ని బాబు బ్యాచ్ మరిచింది. దీనికి తోడు.. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తీరు తోడైంది. ఎందుకంటే.. టీడీపీ పార్టీ గదిని వైఎస్సార్ కాంగ్రెస్ కు కేటాయించారు. అదే సమయంలో టీడీపీకి గదిని కేటాయించలేదు. అయితే.. ఈ అంశాన్ని తన వద్దకు తీసుకొచ్చినంతనే స్పీకర్ సానుకూలంగా స్పందించి.. వారికి పై అంతస్తులోని 118ఏ గదిని కేటాయించారు.
అయితే.. తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటున్న 111 గదిని కేటాయించాలన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. దీనికి వారు చెప్పే లాజిక్ ఏమిటంటే.. మా పార్టీ గదిని జగన్ పార్టీ తీసుకుంటుంది కాబట్టి.. వారి పార్టీ గదిని తమకు కేటాయించాలన్న వితండవాదనను తెర పైకి తీసుకొచ్చారు. ఇలాంటి సిత్రమైన కోరిక టీడీపీ నేతలు మాత్రమే కోరతారేమో? ఈ రిక్వెస్ట్ మీద స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. అదే సమయంలో.. టీడీపీ నేతలు వారి గదిని ఖాళీ చేయాలన్నా.. వారు అందుకు స్పందించకపోవటంతో.. మొన్నీమధ్యనే పార్టీకి కేటాయించిన గదిని పార్లమెంటు సిబ్బంది సీజ్ చేశారు. తాము కోరుకున్న గదిని కేటాయించాలని. అప్పటివరకూ తామున్న గదిని ఖాళీ చేయమని.. తాళాలు ఇవ్వమంటూ భీష్మించుకున్న వైనంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రజాతీర్పు వచ్చిన తర్వాత.. వారు తిరస్కరించినప్పుడు అందుకు తగ్గట్లు వ్యవహరించాలే కానీ.. మా తాతలు నేతులు తాగారంటూ గొప్పలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదే సమయంలో.. తక్కువ బలం ఉన్న పార్టీ తన పంతాన్ని నెగ్గించుకోలేదన్న చిన్న విషయాన్ని బాబు లాంటి సీనియర్ నేత ఎలా మిస్ అవుతున్నారన్నది మరో ప్రశ్న.