Begin typing your search above and press return to search.
ఎంపీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట..
By: Tupaki Desk | 19 May 2016 11:13 PM ISTఅధికార పార్టీకి చెందిన ఎంపీ నోట ఆత్మహత్య మాట రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే తెలుగుదేశం పార్టీ ఎంపీ తోట నరసింహం ఇలాంటి ఆశ్చర్యకర వ్యాఖ్యలే చేశారు. రెండు రోజులుగా నర్సింహం పేరు మీడియాలో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఓ అమ్మాయిని నగ్నంగా ఫొటోలు తీసి.. వాటిని బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసినట్లు తోట నర్సింహం మీద తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వ్యవహారం అమ్మాయికి సంబంధించింది కావడంతో మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఐతే తన మీద వచ్చిన ఆరోపణలకు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చిందని నర్సింహం మీడియాతో చెప్పారు.
మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్న నర్సింహం.. ఈ వివాదం బయటపడ్డ రోజు రాత్రి తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని.. తన ఆత్మహత్యను మీడియాకే అంకితం చేయాలనిపించిందని అన్నారు. ఒక పనికిమాలిన వ్యక్తి చేసిన ఆరోపణల్ని ఎందుకు పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఆత్మహత్య ఆలోచన విరమించుకున్నానని చెప్పారు. ఓ అమ్మాయికి సంబంధించిన మార్ఫింగ్ ఫొటోల్ని పట్టుకుని ఓ సైకో లాయర్ తన మీద నిరాధార ఆరోపణలు చేశాడని.. అతడిపై ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నానని నర్సింహం అన్నారు. ఈ గొడవకు సంబంధించి మీడియా చాలా ఓవర్ యాక్షన్ చేసిందని ఆయన విమర్శించారు. తన మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని చెబుతూ పోలీసులు ఇప్పటికే బాలల హక్కుల కమిషన్ కు నివేదక కూడా ఇచ్చినట్లు నర్సింహం చెప్పారు.