Begin typing your search above and press return to search.

బాబు బ‌ల‌మెంతో...శివప్ర‌సాద్ చెప్పేశారుగా!

By:  Tupaki Desk   |   16 April 2017 4:30 AM GMT
బాబు బ‌ల‌మెంతో...శివప్ర‌సాద్ చెప్పేశారుగా!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు ప్ర‌జ‌ల్లో ఉన్న‌ బ‌లం ఏపాటితో ఇట్టే అర్థ‌మ‌య్యేలా... ప‌క్కా లెక్క‌ల‌న్నీ వ‌చ్చేశాయి. చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారావారిప‌ల్లెకు చెందిన చంద్ర‌బాబు... అక్క‌డ ప‌రాభ‌వం ఎదురు కావ‌డంతో ఇక చంద్ర‌గిరిలో త‌న ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని తెలుసుకుని ఎక్క‌డో ఏపీ స‌రిహ‌ద్దులో త‌మిళ‌నాడు - క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌ల ఓట్ల‌తో క‌లిసి ఉన్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రుగులు పెట్ట‌క త‌ప్ప‌లేద‌న్న‌ది విప‌క్షాల వాద‌న‌. అయితే ఈ వాద‌న క‌రెక్టేనంటూ... త‌న పార్టీకి చెందిన ఎంపీ - అది కూడా ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టైన‌ కుప్పం కూడా భాగంగా ఉన్న చిత్తూరు పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గం నుంచి టీడీపీ టికెట్‌ పై వ‌రుస‌గా గెలుస్తూ వ‌స్తున్న ఆ పార్టీ ఎంపీ - ప్ర‌ముఖ సినీ న‌టుడు ఎన్‌. శివ‌ప్ర‌సాద్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన శివ‌ప్ర‌సాద్‌... చంద్రబాబుకు చిన్న‌నాటి స్నేహితుడు. పాఠ‌శాల వ‌య‌సులో ఇద్ద‌రూ ఒకే పాఠ‌శాల‌లో విద్య‌న‌భ్య‌సించార‌ట‌. అయితే ఎస్సీల అభ్యున్న‌తికి త‌మ ప్ర‌భుత్వం ఎంతో చేస్తోందంటూ ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌బాబులోని అస‌లు కోణాన్ని బ‌య‌ట‌పెట్ట‌డమే కాకుండా... ఏపీ టీడీపీలోనే ఓ వ‌ణుకు పుట్టించిన శివ‌ప్ర‌సాద్‌... నిన్న తిరుప‌తిలోని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో బాబు బ‌ల‌గాన్ని ప‌క్కా లెక్క‌ల‌తో స‌హా చెప్పేశారు. చిత్తూరు పార్ల‌మెంటు ప‌రిధిలో మొత్తం ఐదు శాస‌న‌స‌భా నియోజ‌క‌వ‌ర్గాలున్నాయ‌ని, వాటిలో చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం కూడా ఒక‌ట‌ని శివ‌ప్ర‌సాద్ చెప్పారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే కాకుండా అంత‌కుముంద‌టి ఎన్నిక‌ల్లోనూ తాను అదే స్థానం నుంచి ఎంపీగా టీడీపీ టికెట్‌ పైనే విజ‌యం సాధించిన‌ట్లు చెప్పుకొచ్చారు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే... మొత్తం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో మూడింట విప‌క్షం వైసీపీ అభ్య‌ర్థులే విజ‌యం సాధించార‌ని శివ‌ప్ర‌సాద్‌ చెప్పారు. అంటే త‌న ప‌రిధిలోని మెజారిటీ స్థానాలు విప‌క్షానికే ద‌క్కినా... తాను మాత్రం బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించాన‌ని తెలిపారు. చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం స‌హా... మొత్తం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల కంటే కూడా ఎంపీగా నిల‌బ‌డ్డ త‌న‌కే ఎక్కువ మెజారిటీ వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. అంటే... చిత్తూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో చంద్ర‌బాబు హ‌వా ఏమాత్రం కూడా ప‌నిచేయ‌లేద‌ని శివ‌ప్ర‌సాద్ చెప్పారు.

త‌న పార్టీకి చెందిన అభ్య‌ర్థులు మూడు చోట్ల ఓడినా... తాను గెలిచానంటే పార్టీకి చెందిన ఐదుగురి కంటే త‌న‌కే జ‌న‌బ‌లం ఉంద‌ని కూడా ఆయన కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. శివ‌ప్ర‌సాద్ వెల్ల‌డించిన లెక్క‌ల ప్ర‌కారం చూస్తే... చంద్ర‌బాబుకు త‌న సొంత జిల్లాకు చెందిన తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం మిన‌హా మిగిలిన ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనూ అంత‌గా బ‌లం లేద‌నే అర్థం చేసుకోక త‌ప్ప‌దు. ఇక చంద్ర‌బాబు సొంతూరు నారావారిప‌ల్లె ఉన్న చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన మాజీ మంత్రి గ‌ల్లా అరుణ కుమారికి కంగు తినిపించిన వైసీపీ కీల‌క నేత చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. అంటే... త‌న సొంతూరులోనే బాబుకు బ‌లం లేద‌ని తేలిపోయింద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/