Begin typing your search above and press return to search.
బ్యాన్ ఎదుర్కొంటున్న జేసీ ఫారిన్ వెళ్లారే
By: Tupaki Desk | 17 Jun 2017 10:04 AM ISTవిశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో రచ్చ రచ్చ చేసి వార్తల్లోకి ఎక్కిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించిన ఆసక్తికర ఉదంతమిది. ఇండిగో విమానం ఎక్కటానికి బోర్డింగ్ పాస్ లు ఇష్యూ చేయటం నిలిపివేసిన తర్వాత వచ్చి.. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాలని డిమాండ్ చేయటం తెలిసిందే. ఇండిగో సిబ్బంది నో చెప్పాక.. ఆవేశం ఆపుకోలేక ప్రింటర్ ను విసిరి కొట్టిన వైనంతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
జేసీ చేసిన పనిపై పలు విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. ఇదిలా ఉంటే.. చట్టం తన పని తాను చేసుకుంటుందని కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చెప్పటం.. ఇండిగో బ్యాన్ కాస్తా..ఎయిరిండియా.. గో ఎయిర్.. విస్తారా.. ఎయిర్ ఏషియా విమాన సంస్థలు జేసీ మీద బ్యాన్ విధించటం చేశాయి. అయితే.. ఈ బ్యాన్ ఇలా ఉంటే.. జేసీ మాత్రం ఎంచక్కా విదేశాలకు వెళ్లిపోవటం ఆసక్తికరంగా మారింది.
ఓపక్కన జేసీ మీద బ్యాన్ విధించినట్లు విమానయాన సంస్థలు చెబుతున్నప్పటికీ.. వీటితో సంబంధం లేకుండా ఎమిరేట్స్ ఫ్లైట్ లో జేసీ ప్యారిస్ వెళ్లిపోవటం కొసమెరుపుగా చెప్పాలి. పది రోజుల ట్రిప్ లో భాగంగా ప్యారిస్ లో గడపనున్నారు. చూస్తుంటే.. జేసీ బ్యాన్ అంతా స్వదేశీ ప్రయాణాల మీదనేనా? అన్నది ప్రశ్నగా మారింది. నిబంధనలు ఎవరికైనా ఒకేలా ఉంటాయన్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మాటలకు అర్థం ఇదేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పది రోజుల పాటు జేసీ కనిపించని వేళ.. ఆయన ఇష్యూ కూడా కోల్డ్ స్టోరేజీకి వెళ్లిపోనుందా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/