Begin typing your search above and press return to search.

జగన్ తో టచ్లోకి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థి?

By:  Tupaki Desk   |   25 April 2019 8:25 AM GMT
జగన్ తో టచ్లోకి వచ్చిన టీడీపీ ఎంపీ అభ్యర్థి?
X
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక యంగ్ పొలిటీషియన్ కమ్ టీడీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో టచ్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రతిపాదనతో ఆ ఎంపీ అభ్యర్థి జగన్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

సదరు ఎంపీ అభ్యర్థి ఒక సిట్టింగ్ ఎంపీ. ఈ సారి తండ్రి రిటైరై తనయుడికి అవకాశం ఇప్పించుకున్నాడు. టీడీపీ టికెట్ ఇప్పించాడు. వీళ్లకు ఉన్న రాజకీయ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఎంపీగా గెలవాల్సిన అవసరం చాలానే ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా వీళ్ల పరువు పోతుంది.

గెలుపు విషయంలో వీరు ధీమాగానే కనిపిస్తున్నారు. అయితే రాష్ట్రంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విశ్లేషణల మధ్యన ఈ ఎంపీ అభ్యర్థి అప్పుడే జగన్ తో టచ్లోకి వెళ్లినట్టుగా సమాచారం. ఇతడు జగన్ తో సమవయస్కుడు. జగన్ కు ఫ్రెండ్ అనే టాక్ కూడా ఉంది. రాజకీయంగా విబేధాలు గతం నుంచి ఉన్నా.. జగన్ తో ఇతడికి సాన్నిహిత్యం ఉందంటారు. ఆ విషయాన్ని కూడా ఇతడూ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నాడు.

ఇక తను ఎంపీగా గెలవడం ఖాయమనే ధీమాతో ఉన్న ఈ యువనేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమనే అంచనాలతో అటు వైపు జంపింగ్ కు ఇప్పటికే రెడీ అయిపోయారట. ఫలితాలకు ముందే అక్కడ కర్చిఫ్ వేస్తే కాస్త విలువ పెరుగుతుందనే లెక్కతో జగన్ తో అపాయింట్ మెంట్ కోసం కూడా ప్రయత్నాలు సాగించినట్టుగా సమాచారం.

అయితే ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ ఎంపీ క్యాండిడేట్ కు జగన్ అపాయింట్ మెంట్ దక్కుతుందని భోగట్టా. అయితే ఇక్కడ జగన్ మరిన్ని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారట.

అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ముందు.. సదరు జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో జగన్ ఈ అంశం మీద చర్చించనున్నట్టుగా సమాచారం. వారి అభిప్రాయాలను తీసుకుని.. వారిలో మెజారిటీ మంది అందుకు సమ్మతిస్తే సదరు యువనేతను పార్టీలోకి తీసుకోవాలని జగన్ అనుకుంటున్నారట. కేవలం తమ పార్టీ వాళ్ల అభిప్రాయాల మీదే జగన్ అతడిని చేర్చుకోవడం, చేర్చుకోకపోవడం ఉంటుందట. అన్నింటికి మించి సదరు యువనేత ఎంపీగా నెగ్గితేనే జగన్ దగ్గర విలువ ఉండవచ్చు.

ఒకవేళ గెలిచినా.. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలోకి చేరాలనే షరతును జగన్ అమలు పరచబోతున్నట్టుగా సమాచారం. టీడీపీ ద్వారా ఎంపీగా గెలిస్తే ఆ పదవికి రాజీనామా చేసి - మళ్లీ వైఎస్సార్సీపీ టికెట్ మీద పోటీ చేయడానికి జగన్ ఓకే అంటారని.. టీడీపీ తరఫున గెలిచేసి - వైఎస్సార్సీపీలోకి ఫిరాయించేయడానికి సదరు నేత రెడీగా ఉన్నా - అలాంటి ఫిరాయింపును ఎంకరేజ్ చేయడానికి జగన్ మాత్రం సానుకూలంగా లేరని సమాచారం!