Begin typing your search above and press return to search.

లోకేశా...ఇలా ఎన్నాళ్ళు....?

By:  Tupaki Desk   |   5 May 2022 7:00 AM IST
లోకేశా...ఇలా ఎన్నాళ్ళు....?
X
టీడీపీ యువ నాయకుడు లోకేష్ రాజకీయం ఎలా ఉంది అంటే తమ్ముళ్ళే కరెక్ట్ గా చెబుతారేమో. ఒక వైపు ట్వీటడం, మరో వైపు లేఖలు రాయడం, వీలు కుదిరితే పరామర్శ యాత్రలు చేయడం. ఏం చేసినా టార్గెట్ మాత్రం వైసీపీని ఆడిపోసుకోవడం. ఇలాగే మూడేళ్ళూ సాగింది, అదే సాగుతోంది. దాంతో కొత్త సబ్జెక్ట్ లేదా లోకేశా అని ప్రశ్నలు పుట్టుకువస్తున్నాయి.

నిజానికి లోకేష్ ఈ టైమ్ లో ఈ ఏజ్ లో ఎంత జోరు చేయాలో కదా. ఇదే వయసులో చంద్రబాబు ఎలా ఉండేవారని. పోనీ అపర చాణక్యుడు తండ్రిలో పోల్చకూడదు, జూనియర్ వేరు అని అనుకున్నా ఇప్పటికి పదేళ్ళుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాల్లో ఉన్న లోకేష్ ఎంతవరకూ విషయం నేర్చారు అన్నదే కదా చర్చకు వచ్చే పాయింట్.

ఇక ఏపీలో పరీక్షా పత్రాల లీకేజ్ మీద లేటెస్ట్ గా ఒక చేత్తో మంత్రి బొత్సకు మరో చేత్తో సీఎం జగన్ కి లేఖలు సంధించిన లోకేష్ అందులో చాలా ఆరోపణలు గుప్పించారు. నిజానికి ఏపీలో కొన్ని పాఠశాలల్లో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. అయితే అవి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తరువాత వచ్చినవి. దానికి సంబంధించి బాధ్యులను అరెస్ట్ చేశారు. అందులో ముప్పయి మంది దాకా టీచర్లు ఉన్నారు.

ఇదిలా ఉంటే లోకేశం లేఖకు కాస్తా గట్టిగానే రియాక్ట్ అయిన మంత్రి బొత్స తాము ఇప్పటికి అరవై మంది మీద చర్యలు తీసుకున్నామని, అందులో 22 మంది ఏకంగా నారాయణ, చైతన్య వంటి ప్రైవేట్ స్కూళ్ళకు చెందిన వారే అని రివర్స్ అటాక్ చేశారు. ఇక ఇలా మాస్ కాపీయింగ్ లో స్కూళ్ళ యాజమాన్యం పాత్ర ఉంటే కనుక ఆ పరీక్షా కేంద్రాలను కూడా బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు.

ఇక గత టీడీపీ ఏలుబడిలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు వచ్చినా ఏ ఒక్కరి మీద అయినా చర్యలు తీసుకున్నారా అని లోకేష్ నే ప్రశ్నించారు. మొత్తానికి నారాయణ చైతన్య అంటూ లోకేష్ ని కార్నర్ చేస్తూ అయన లేఖకు బొత్స జవాబు ఇవ్వడమే ఇక్కడ విశేషం. ఇవన్నీ ఇలా ఉంటే ఇదే ప్రశ్న పత్రాల లీక్స్ అంటూ ఇప్పటికే అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు కూడా చాలా విమర్శలు చేశారు. మరో వైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టడంతో రెండు రోజులుగా వాటి ఊసు లేదు.

ఈ టైమ్ లో లోకేష్ పరీక్షా పేపర్ల లీకేజ్ అంటూ పాత పాయింట్ ని కొత్తగా తెచ్చి లేఖలు రాయడం, ఏకంగా ఫెయిల్యూర్ సీఎం , ఫెయిల్యూర్ సర్కార్ అని విమర్శలు చేయడం అంతా చూస్తూంటే రొటీన్ రొడ్డకొట్టుడు కామెంట్స్ తో మీడియాలో ఉండాలన్న తాపత్రయం తప్ప కొత్త పాయింట్ ఏదీ లోకేశా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి చూస్తే సరైన సమస్యలూ సబ్జక్టులూ ఏవీ ఏపీలో లేవా లేక అవి చినబాబు దృష్టిలో పడడంలేదా అన్నదే చర్చగా ఉంది. లోకేష్ విషయం తీసుకుంటే సరైన సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తడబడుతున్నాడు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక పోతే సమస్యలకు ఏమైనా కొరతా. లోకేష్ జనంలోకి వస్తే వీధికో వంద కనిపిస్తాయి.

అయినా అన్నీ సమస్యల మీదా మాట్లాడడానికి అవి భావి ముఖ్యమంత్రి స్థాయి కూడా కాదు, ఏ పాయింట్ తో ఎలా మాట్లాడాలో కూడా చూడాలి. ఇకపోతే లోకేష్ బాబు బ్యాచ్ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు అని ఇప్పటికే జనాల్లో ఒక విధమైన ఇంప్రెషన్ పడిపోతున్న వేళ జనం కోసమే తమ బాధ అంతా అన్నట్లుగా కలరింగ్ ఇవ్వాలీ అంటే ఈ కృషి చాలదేమో లోకేశా అంటున్నారు అంతా.